News November 30, 2025
పెద్దపల్లి జిల్లా వార్డ్ సభ్యుల నామినేషన్లకు భారీ స్పందన

పెద్దపల్లి జిల్లా గ్రామపంచాయతీ ఎన్నికల్లో వార్డు సభ్యుల నామినేషన్ల దాఖలు నిన్నటితో ముగిసింది. చివరి రోజు అభ్యర్థుల రద్దీ అధికంగా ఉండడంతో పెద్ద సంఖ్యలో దరఖాస్తులు వచ్చాయి. మొత్తం 896 వార్డులకు 2,146 నామినేషన్లు దాఖలయ్యాయి. కమాన్ పూర్ 253, మంథని 615, ముత్తారం 339, రామగిరి 449, శ్రీరాంపూర్ 490 నామినేషన్లు సమర్పించారు. నామినేషన్ ప్రక్రియ మొత్తం శాంతియుతంగా సాగిందని జిల్లా ఎన్నికల అధికారులు తెలిపారు.
Similar News
News February 12, 2026
చిన్నారులకు నాన్‌వెజ్ ఎప్పుడు పెట్టాలంటే?

పిల్లల ఎదుగుదలలో ఆహారం కీలకపాత్ర పోషిస్తోంది. 6నెలల నుంచి పిల్లలకు నెమ్మదిగా ఘనాహారం అలవాటు చెయ్యాలని నిపుణులు సూచిస్తున్నారు. 8నెలల నుంచి మాంసాహారం ఇవ్వాలి. ముందుగా ఉడికించిన గుడ్డు, సంవత్సరం దాటిన తర్వాత చికెన్, చేపలు పెట్టాలి. వాటిని బాగా ఉడికించి మెత్తగా చేసి పిల్లలకు పెట్టాలని చెబుతున్నారు. మాంసాహారంలో ఐరన్, జింక్ పుష్కలంగా ఉంటాయి. కాబట్టి నెమ్మదిగా పిల్లలకు అలవాటు చెయ్యాలంటున్నారు.
News February 12, 2026
VZM: ఆసుపత్రి ముంగిటే మృతి

విజయనగరం మహారాజ ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి ప్రాంగణంలో గుర్తుతెలియని యువకుడి మృతదేహం కలకలం రేపింది. ఆసుపత్రి క్యాజువాలిటీ వద్ద సుమారు 30 ఏళ్ల వయస్సు ఉన్న యువకుడు అచేతనంగా పడిఉన్నా సిబ్బంది ఎవరూ పట్టించుకోలేదని ఆరోపణలు వచ్చాయి. అయితే తమ వైద్య సిబ్బంది వెంటనే స్పందించి, అతడిని లోపలికి తీసుకువెళ్లి చికిత్స అందించారని అప్పటికే ఆ వ్యక్తి మరణించినట్లు సూపరింటెండెంట్ డా.పద్మజ తెలిపారు.
News February 12, 2026
VZM: ఆ 40 మందిలో మీ ఎమ్మెల్యే ఉన్నారా?

కూటమి ఎమ్మెల్యేల సమావేశంలో CM చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. సుమారు 40 మంది ఎమ్మెల్యేల పనితీరు ఆశాజనకంగా లేదని ఆయన అసహనం వ్యక్తం చేశారు. ఈ జాబితాలో ఉమ్మడి విజయనగరం జిల్లాకు చెందిన పలువురు ప్రజాప్రతినిధులు ఉన్నట్లు సమాచారం. పనితీరు మార్చుకోని వారితో నేరుగా మాట్లాడతానని CM వెల్లడించారు. మరి మీ ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉంది? ఆ 40 మందిలో మీ ఎమ్మెల్యే ఉన్నారని అనుకుంటున్నారా కామెంట్ చేయండి.


