News November 19, 2025
పెద్దపల్లి: పత్తి రైతుల సమస్యలపై కేంద్ర మంత్రికి ఎంపీ లేఖ

తెలంగాణ పత్తి రైతుల సమస్యలపై కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్‌కు లేఖ రాసినట్లు పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ మంగళవారం తెలిపారు. రాష్ట్ర సగటు పత్తి దిగుబడిని 11.74 క్వింటాళ్లుగా కొనసాగించాలని, అలాగే పత్తిలో మాయిశ్చర్ పరిమితిని 20 శాతం వరకు సడలించాలని లేఖలో విజ్ఞప్తి చేసినట్లు పేర్కొన్నారు. మిల్లర్లు అండ్ ట్రేడర్స్ అసోసియేషన్ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని కూడా ఎంపీ కోరినట్లు తెలిపారు.
Similar News
News January 18, 2026
VJA: మైనర్‌తో గులకరాయి నిందితుడి ప్రేమాయణం..!

వైసీపీ అధినేత జగన్‌పై గతంలో గులకరాయి దాడి చేసిన కేసులో నిందితుడు వేమూరి సతీశ్ కుమార్‌కు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. విజయవాడ సింగ్‌నగర్‌కు చెందిన ఇతను ఓ మైనర్ బాలికను ప్రేమించి, పెళ్లి చేయాలంటూ శనివారం పోలీస్ స్టేషన్‌కు వెళ్లాడు. బాలిక వయసు రీత్యా మైనర్ కావడంతో పోలీసులు సతీశ్‌పై కేసు నమోదు చేశారు. కోర్టులో హాజరుపరచగా న్యాయమూర్తి రిమాండ్‌కు ఆదేశించడంతో అతడిని జైలుకు తరలించారు.
News January 18, 2026
వేగం కన్నా ప్రాణం మిన్న.. వాహనదారులకు ఎస్పీ హితవు

సంక్రాంతి ముగించుకుని గమ్యస్థానాలకు వెళ్లే ప్రయాణికులు రహదారి నియమాలు పాటించాలని జిల్లా ఎస్పీ డి.నరసింహ కిషోర్ సూచించారు. రోడ్లపై రద్దీ దృష్ట్యా వాహనదారులు వేగ నియంత్రణ పాటించాలని, వేగంగా వెళ్లడం కంటే క్షేమంగా చేరడం ముఖ్యమని హితవు పలికారు. వీలైనంత వరకు రాత్రి ప్రయాణాలు మానుకోవాలని కోరారు. అప్రమత్తంగా ఉండి ప్రమాదాలు నివారించాలని ఆదివారం ఆయన ఒక ప్రకటనలో కోరారు.
News January 18, 2026
GDK: రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి

గోదావరిఖని KCR కాలనీకి చెందిన సాత్విక్ నిన్న రాత్రి జవహర్ నగర్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. కరీంనగర్‌లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందాడు. సాత్విక్ తన మిత్రుడు కార్తీకేయతో కలిసి బైక్‌పై వస్తుండగా అదుపు తప్పి బైక్ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో కార్తీకేయకు తీవ్ర గాయాలు కాగా.. సాత్విక్ మృతి చెందాడు. ఈ సంఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు.


