News November 19, 2025
పెద్దపల్లి: పత్తి రైతుల సమస్యలపై కేంద్ర మంత్రికి ఎంపీ లేఖ

తెలంగాణ పత్తి రైతుల సమస్యలపై కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్‌కు లేఖ రాసినట్లు పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ మంగళవారం తెలిపారు. రాష్ట్ర సగటు పత్తి దిగుబడిని 11.74 క్వింటాళ్లుగా కొనసాగించాలని, అలాగే పత్తిలో మాయిశ్చర్ పరిమితిని 20 శాతం వరకు సడలించాలని లేఖలో విజ్ఞప్తి చేసినట్లు పేర్కొన్నారు. మిల్లర్లు అండ్ ట్రేడర్స్ అసోసియేషన్ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని కూడా ఎంపీ కోరినట్లు తెలిపారు.
Similar News
News January 13, 2026
పరమానందంగా రామయ్య నిత్య కళ్యాణం

భద్రాచల శ్రీ సీతారామచంద్రస్వామి వారి ఆలయంలో భద్రాద్రి రామయ్య నిత్య కళ్యాణం వేడుక మంగళవారం ఘనంగా నిర్వహించారు. తెల్లవారుజామున గర్భగుడిలో స్వామివారికి సుప్రభాత సేవ, సేవా కాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం మేళ తాళాల నడుమ గర్భగుడి నుంచి ఊరేగింపుగా తీసుకువచ్చి బేడా మండపంలో కొలువు తీర్చారు. విశ్వక్సేన పూజ, పుణ్య వాచనం అనంతరం కంకణ ధారణ, యౌక్త్రధారణ గావించి నిత్య కళ్యాణాన్ని ఆలయ అర్చకులు నిర్వహించారు.
News January 13, 2026
ఇండియాలో ఆడబోం.. ICCకి స్పష్టం చేసిన బంగ్లా

టీ20 వరల్డ్‌కప్ మ్యాచులను ఇండియాలో <<18761652>>ఆడబోమని<<>> బంగ్లాదేశ్ మరోసారి స్పష్టం చేసింది. తమ ప్లేయర్ల భద్రత దృష్ట్యా వేరే దేశంలో మ్యాచులు నిర్వహించాలని కోరింది. ఇవాళ ICCతో బంగ్లా బోర్డు వర్చువల్‌గా సమావేశమైంది. టోర్నమెంట్ షెడ్యూలు, ప్రయాణ ప్లాన్ ఇప్పటికే ఖరారైందని, దీనిపై పునరాలోచించాలని ICC కోరింది. కానీ BCB ఒప్పుకోలేదు. దీంతో ఏకాభిప్రాయం కోసం చర్చలను కొనసాగించాలని బోర్డులు అంగీకరించాయి.
News January 13, 2026
చిత్తూరు ఎస్పీ తుషార్ డూడీ కీలక ఆదేశాలు

చిత్తూరు జిల్లాలో ఎక్కడ జల్లికట్టు, కోడిపందాలు, పేకాట నిర్వహించకుండా పోలీస్ అధికారులు చర్యలు తీసుకోవాలని ఎస్పీ తుషార్ డూడీ మంగళవారం ఆదేశించారు. ఎక్కడైనా నిర్వహించే అవకాశం ఉంటే 112 కు లేదా 9440900005 ఫోన్ లేదా మెసేజ్ చేయాలని సూచించారు. తమ సిబ్బంది వెంటనే చేరుకొని చర్యలు తీసుకుంటారని వెల్లడించారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని స్పష్టం చేశారు.


