News November 20, 2025
పెద్దపల్లి: పల్లె పోరుకు సిద్ధమా…?

స్థానిక సంస్థల ఎన్నికల పోరు సంబంధించిన ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కోసం ఆశావహులు అంతంత మాత్రమే అన్నట్లుగా గ్రామంలో వాతావరణం నెలకొంది. పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా 13 జడ్పీటీసీ, 138 ఎంపీటీసీ, 263 పంచాయతీలు, 2,474 వార్డు స్థానాలు ఉన్నాయి. ముందుగా సర్పంచ్ ఎన్నికలు జరిగేతే, ఈ ఎన్నికల్లో నాయకులు ఓడితే ఎంపీటీసీ ఎన్నికల్లో నాయకులు వారి అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.
Similar News
News January 13, 2026
15 నుంచి గ్రామ స్థాయిలో ఉపాధిహామీ పథకం సోషల్ ఆడిట్

రామభద్రపురం మండలంలో 2024-25 సంవత్సరానికి సంబంధించి 22 గ్రామ పంచాయతీల్లో ఉపాధిహామీ పథకం సోషల్ ఆడిట్ పారదర్శకంగా నిర్వహించాలని స్టేట్ రిసోర్సుపర్సన్ గోవింద్ కోరారు. ఉపాధిహామీ పథక కార్యాలయంలో సోమవారం ఆయన మాట్లాడారు. ఈ నెల 15 నుంచి గ్రామ స్థాయిలో ఉపాధి పనులు, సామాజిక భద్రతా పింఛన్లపై తనిఖీలు నిర్వహిస్తామన్నారు. సుమారు రూ.16.50 కోట్ల విలువచేసే పనులపై ఈ
సోషల్ ఆడిట్ నిర్వహిస్తున్నామని తెలిపారు.
News January 13, 2026
పులివెందుల హత్యాయత్నం కేసులో ఇద్దరికి జైలు శిక్ష

పులివెందుల అప్‌గ్రేడ్ పోలీస్ స్టేషన్ పరిధిలో రెండున్నర సంవత్సరాల కిందట జరిగిన హత్యాయత్నం కేసులో ఇద్దరు నిందితులకు 3 సంవత్సరాల జైలు శిక్షతో పాటు రూ.10 వేల జరిమానా విధిస్తూ కడప అదనపు సెషన్స్ కోర్టు సోమవారం తీర్పు వెలువరించింది. ఫిర్యాదిదారుడిపై కత్తితో దాడి చేసినట్టు నేరం రుజువుకావడంతో ఈ శిక్ష విధించారు. ఈ కేసులో అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ బాలాజీతో పాటు పోలీసు సిబ్బందిని ఎస్పీ అభినందించారు.
News January 13, 2026
సంగారెడ్డి: హాజరు ఆధారంగానే జీతాలు: కలెక్టర్

సంగారెడ్డి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యులు, సిబ్బంది హాజరు కోసం ఫేస్ రికగ్నిషన్ (ముఖ గుర్తింపు) విధానాన్ని అమలు చేయాలని కలెక్టర్ ప్రావీణ్య ఆదేశించారు. సోమవారం వైద్యశాఖపై నిర్వహించిన సమీక్షలో మాట్లాడుతూ.. హాజరు ఆధారంగానే జీతాల చెల్లింపులు జరగాలని స్పష్టం చేశారు. వైద్యులు సమయపాలన పాటిస్తూ రోగులకు మెరుగైన సేవలు అందించాలని, విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ హెచ్చరించారు.


