News January 24, 2025

పెద్దపల్లి: ప్రజాపాలన దరఖాస్తులు ఎన్నంటే?

image

పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా ప్రజాపాలన గ్రామసభలు నిన్నటి సాయంత్రంతో ముగిశాయి. జిల్లా వ్యాప్తంగా 200కు పైగా గ్రామపంచాయతీలు, వందకు పైగా వార్డులు ఉన్నాయి. ఈ ప్రాంతాల్లో సభలు నిర్వహించారు. అయితే దరఖాస్తుల స్వీకరణకు సంబంధించిన వివరాలను అధికారులు వెల్లడించారు. ఆత్మీయ భరోసా పథకానికి 6,400 రాగా ఇందిరమ్మ ఇళ్లకు 19 వేలకు పైగా దరఖాస్తులు వచ్చినట్లు తెలిపారు.

Similar News

News February 8, 2025

Delhi Results: ఇండీ కూటమిపై ఒమర్ అబ్దుల్లా విమర్శలు

image

ఢిల్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, ఆప్ పార్టీలు ఘోర ఓటమి దిశగా ప్రయాణిస్తున్న నేపథ్యంలో జమ్మూకశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా ఇండీ కూటమిపై విమర్శలు గుప్పించారు. రామాయణం సీరియల్‌కు సంబంధించిన జిఫ్‌ను షేర్ చేశారు. ‘జీవితమంతా కొట్టుకుంటూ ఉండండి. ఒకరినొకరు అంతం చేసుకోండి’ అని అందులో ఉంది. ఇండియా కూటమి పార్టీలు కొట్లాడుకుంటుంటే ఫలితాలు ఇలాగే ఉంటాయంటూ పరోక్షంగా విమర్శించారు.

News February 8, 2025

కాప్రా: బతికున్నప్పుడు దరఖాస్తు.. చనిపోయాక పెన్షన్

image

ఉప్పల్ నియోజకవర్గం కాప్రా సర్కిల్ పరిధిలో 2022లో పెన్షన్ కోసం పలువురు వృద్ధులు పలుమార్లు దరఖాస్తు చేసుకున్నారు. వారిలో 191 మంది పెన్షన్ మంజూరైనట్లు సర్కిల్ అధికారులు జాబితా విడుదల చేశారు. ఆ జాబితాలో 32 మంది మృతుల పేర్లు ఉన్నాయని కాప్రా సర్కిల్ అధికార వర్గాల సమాచారం. బతికి ఉన్నప్పుడు పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకుంటే చనిపోయాక మంజూరు కావడం మున్సిపల్ పరిధిలో చర్చనీయాంశంగా మారింది.

News February 8, 2025

మహబూబాబాద్: గ్రామాల్లో మొదలైన ‘స్థానిక’ సందడి!

image

ఈ నెలలో స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం, ఎన్నికల సంఘం కసరత్తు చేస్తున్నాయి. దీంతో మహబూబాబాద్ జిల్లాలోని గ్రామాల్లో ఎన్నికల సందడి నెలకొంది. అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీలకు చెందిన ఆశావహులు మంతనాలు జరుపుతున్నారు. తమకు ఈసారి అవకాశం ఇవ్వాలని గ్రామాల్లోని కొందరు ఆయా పార్టీల ముఖ్య నేతలను కోరుతున్నారు. ఇప్పటికే పల్లెల్లో ఎన్నికల వాతావరణం మొదలైంది.

error: Content is protected !!