News August 23, 2025
పెద్దపల్లి: ఫోటోగ్రాఫర్లు నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి

మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా ఫోటోగ్రాఫర్లు నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలని తెలంగాణ ఫోటో వీడియో గ్రాఫర్ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎస్.కె హుస్సేన్ అన్నారు. పెద్దపల్లి నందన గార్డెన్‌లో జిల్లా ఫొటో అండ్ వీడియో గ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేసి వేడుకలను నిర్వహించారు. సీనియర్ ఫొటో గ్రాఫర్లను సన్మానించారు.
Similar News
News January 12, 2026
HYD: రూ.60కే సంక్రాంతి సంబరాలు

HYD హైటెక్ సిటీ నడిబొడ్డున పల్లెటూరి పండగ సందడి మొదలైంది. మాదాపూర్ సాఫ్ట్‌వేర్ కుర్రాళ్ల నుంచి ఆటో అన్నల దాకా అందరినీ అలరించేందుకు శిల్పారామం సంక్రాంతి సంబరాలు (జనవరి 13-17) సిద్ధమయ్యాయి. నల్గొండ గంగిరెద్దుల విన్యాసాలు, హరిదాసుల కీర్తనలు, పుట్టపాక చేనేత సిరులతో 65 ఎకరాల ప్రాంగణం అలరిస్తోంది. టికెట్ కేవలం రూ.60 మాత్రమే. ఉదయం 10:30 నుంచి రాత్రి 8 గంటల వరకు మన ఊరి పండగను ఇక్కడే చూసేయండి!

ఇందిరమ్మ ఇండ్ల బిల్లుల కోసం డబ్బులివ్వొద్దు: శ్రీధర్ బాబు

ఇందిరమ్మ ఇండ్ల బిల్లుల పేరుతో ఎవరికీ రూపాయి ఇవ్వాల్సిన అవసరం లేదని సోమవారం మంథని పర్యటనలో మంత్రి శ్రీధర్‌బాబు స్పష్టం చేశారు. ఎల్-1 లబ్ధిదారులకు 4 విడతల్లో రూ.5 లక్షలు నేరుగా బ్యాంక్ ఖాతాల్లో జమ అవుతాయని తెలిపారు. డబ్బులు అడిగే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆర్డీఓకు ఆదేశించారు. ఐదు నెలల్లో 317 మంది లబ్ధిదారులు ఇళ్లు పూర్తి చేసుకుని గృహప్రవేశం చేయాలన్నారు. అవినీతికి తావు లేదని మంత్రి తెలిపారు.