News March 7, 2025

పెద్దపల్లి: బైక్ అదుపుతప్పి యువకుడి దుర్మరణం

image

రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందిన ఘటన మంథని మండలం బిట్టుపల్లి గ్రామ శివారులోని మూల మలుపు వద్ద జరిగింది. స్థానికుల వివరాలిలా.. హైదరాబాద్(గచ్చిబౌలి) నుంచి ఖమ్మంపల్లి స్నేహితుడి వివాహానికి వస్తున్న ఉదయ్ బైక్ అదుపు తప్పి చెట్టును ఢీకొనడంతో తలకు తీవ్రగాయాలై, అక్కడికక్కడే మృతిచెందాడని తెలిపారు. మరొకరికి తీవ్ర గాయాలైనట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News December 17, 2025

క్యూలో ఉన్న వారందరికీ ఓటుకు అవకాశం: కలెక్టర్

image

మధ్యాహ్నం ఒంటి గంటలోపు పోలింగ్ కేంద్రం ప్రాంగణంలో ఉన్న ప్రతి ఒక్కరికి టోకెన్లు జారీ చేసి ఓటు వేసే అవకాశం కల్పించినట్లు కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్ తెలిపారు. బుధవారం మండలంలోని వర్ధాపురం జడ్పీ హైస్కూల్ పోలింగ్ కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. వర్ధాపురంలోని 8 వార్డుల్లో 999 ఓట్లకు గాను మధ్యాహ్నం 12 గంటలకే 85 శాతం పోలింగ్ పూర్తయిందని ఆర్వో స్వామి వివరించారు.

News December 17, 2025

రియల్ లైఫ్ ‘జెర్సీ’ మూమెంట్!

image

మన కెరీర్ క్లోజ్ అనుకున్నప్పుడు లైఫ్ మరో ఛాన్స్ ఇస్తే ఆ ఫీలింగ్‌‌ను ‘జెర్సీ రైల్వే స్టేషన్ సీన్’ కంటే బాగా ఏదీ చెప్పలేదేమో. తాజా IPL వేలంలో అదే రిపీటైంది. యంగేజ్‌లోనే సచిన్, సెహ్వాగ్, లారాల కాంబోగా గుర్తింపు పొందిన <<18585528>>పృథ్వీ‌షా<<>> ఆ తర్వాత వివాదాలు&ఫామ్ లేక కనుమరుగయ్యారు. టన్నుల కొద్ది డొమెస్టిక్‌ రన్స్ కొట్టినా సర్ఫరాజ్‌‌కు స్థానం దొరకలేదు. రీఎంట్రీ కష్టమనుకున్న సమయంలో వీరిని DC, CSK ఆదుకున్నాయి.

News December 17, 2025

సూర్యాపేట: @ ఒంటిగంట వరకు పోలింగ్ శాతం ఎంతంటే?

image

సూర్యాపేట జిల్లాలో నిర్వహించిన 3వ విడత ఎన్నిక పోలింగ్ శాతాన్ని అధికారులు వెల్లడించారు.
చింతలపాలెం – 82.59%
గరిడేపల్లి – 87.72%
హుజూర్‌నగర్ – 83.18%
మట్టంపల్లి – 88.97%
మేళ్లచెరువు – 85.08%
నేరేడుచర్ల – 86.14%
పాలకవీడు – 87.60%
జిల్లా వ్యాప్తంగా 86.19% నమోదైందన్నారు.