News April 1, 2024
పెద్దపల్లి: బైక్ చెట్టుకు ఢీకొని వ్యక్తి మృతి

సుల్తానాబాద్ మండలం సుద్దాల సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందిన ఘటన ఆదివారం చోటుచేసుకుంది. ఎస్ఐ శ్రావణ్ కుమార్ తెలిపిన ప్రకారం… ఓదెల మండలానికి శ్రీనివాస్(46) ఓ వివాహ వేడుకల్లో పాల్గొని తిరిగి ఓదెలకు వెళ్తున్న క్రమంలో సుద్దాల సమీపంలో బైక్ అదుపుతప్పి చెట్టుకి ఢీకొనడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
Similar News
News February 10, 2026
కరీంనగర్‌లో 23 ప్రత్యేక బృందాలతో నిఘా

ఎన్నికల్లో నగదు, మద్యం పంపిణీని అరికట్టేందుకు 23 ప్రత్యేక బృందాలను రంగంలోకి దించినట్లు కరీంనగర్ సీపీ గౌష్ ఆలం తెలిపారు. ఈ బృందాలు నిరంతరం తనిఖీలు నిర్వహిస్తాయన్నారు. ఎన్నికల ఉల్లంఘనలపై ప్రజలు 87126 70744, 87126 70745 నంబర్లకు లేదా డయల్ 100కు ఫిర్యాదు చేయాలని సూచించారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు.
News February 10, 2026
1300 మందితో బందోబస్తు: కరీంనగర్ సీపీ

కరీంనగర్ జిల్లాలో మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు 1300 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు సీపీ గౌస్ ఆలం తెలిపారు. కరీంనగర్ కార్పొరేషన్ సహా హుజురాబాద్, జమ్మికుంట, చొప్పదండిలో నిఘా పెంచామన్నారు. సున్నిత కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్, స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద మూడంచెల భద్రత ఉంటుందని, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
News February 10, 2026
కరీంనగర్ జిల్లాలో 189 మంది బైండోవర్: సీపీ గౌష్ ఆలం

మున్సిపల్ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు పోలీస్ శాఖ కఠినమైన ముందస్తు చర్యలు చేపట్టింది. కరీంనగర్ జిల్లాలో ఇప్పటికే 189 మంది రౌడీషీటర్లను బైండోవర్ చేయడంతో పాటు, 49 లైసెన్స్ ఆయుధాలను డిపాజిట్ చేయించినట్లు సీపీ గౌస్ ఆలం తెలిపారు. నిబంధనల ఉల్లంఘనపై ఇప్పటివరకు 13 కేసులు నమోదు చేశామని, సమస్యాత్మక ప్రాంతాల్లో అదనపు బలగాలతో నిరంతరం నిఘా కొనసాగుతోందని ఆయన వెల్లడించారు.


