News September 12, 2025
పెద్దపల్లి: ‘బైపాస్ రోడ్డుకు భూములు ఇస్తాం’

గోదావరి తీరంపై ప్రతిపాదిత మంచిర్యాల-పెద్దపల్లి వంతెన నిర్మాణ బైపాస్ రహదారి మార్గాన్ని నూతనంగా మళ్లించడం కాకుండా, ప్రస్తుతం ఉన్న రహదారి ద్వారానే తీసుకురావాలని రైతులు కోరుతున్నారు. తమ భూములను స్వచ్ఛందంగా ఇవ్వడానికి సిద్ధమని తెలిపారు. ఇలా చేస్తే మంథని బస్ డిపో వరకు రహదారి చేరి పట్టణం, వ్యాపారాలు, ఆసుపత్రులు ప్రజలకు సులభంగా అందుబాటులోకి వస్తాయని మంత్రి శ్రీధర్ బాబుకు శుక్రవారం వినతి పత్రం అందజేశారు.
Similar News
News December 12, 2025
3 దేశాల పర్యటనకు ప్రధాని మోదీ

PM మోదీ ఈ నెల 15 నుంచి 18వ తేదీ వరకు జోర్డాన్, ఇథియోపియా, ఒమన్ దేశాల్లో పర్యటించనున్నారు. జోర్డాన్ రాజు అబ్దుల్లా-2 బిన్ ఆల్ హుస్సేన్ ఆహ్వానం మేరకు PM ముందుగా ఆ దేశానికి వెళ్తారు. ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక బంధాలు మొదలై 75 ఏళ్లు పూర్తైన సందర్భంగా ఈ భేటీ కీలకం కానుంది. అక్కడి నుంచి ఇథియోపియా వెళ్తారు. ఆ దేశానికి ప్రధాని వెళ్లడం ఇదే తొలిసారి. ఆ దేశంలో చర్చల అనంతరం ఒమన్ చేరుకొని తిరుగు పయనమవుతారు.
News December 12, 2025
MHBD జిల్లాలో కాంగ్రెస్‌కే 80 సర్పంచ్ స్థానాలు

మహబూబాబాద్ జిల్లాలో మొదటి విడత ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. జిల్లాలో రాత్రి 10 వరకు సర్పంచ్ ఫలితాలు వెలువడ్డాయి. మహబూబాబాద్ జిల్లాలో మొత్తం 155 గ్రామ పంచాయతీలకు గాను 9 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం కాగా.. 146 గ్రామాలకు ఎన్నికలు జరిగాయి. కాంగ్రెస్-80, బీఆర్ఎస్-47, బీజేపీ-5, స్వతంత్ర అభ్యర్థులు-14 మంది సర్పంచ్‌లుగా గెలుపొందారు.
News December 12, 2025
4 కోట్ల మంది ప్రజలను గెలిపించాలన్నదే నా తపన: CM రేవంత్

TG: ఫుట్‌బాల్ తనకు ఇష్టమైన ఆట అని CM రేవంత్ తెలిపారు. ‘టీం స్పిరిట్‌ను ప్రదర్శించాల్సిన క్రీడ ఇది. TG టీంకు లీడర్‌గా 4కోట్ల మంది ప్రజలను గెలిపించాలన్నదే నా తపన. సంగారెడ్డి(D) సదాశివపేట్ కంకోల్‌లోని వోక్సెన్ వర్సిటీ సందర్శన వేళ విద్యార్థులతో కాసేపు ఫుట్‌బాల్ ప్రాక్టీస్ చేశా’ అని ట్వీట్ చేసి ఫొటోలను షేర్ చేశారు. రేపు ఉప్పల్‌లో మెస్సీ టీంతో రేవంత్ జట్టు ఫ్రెండ్లీ మ్యాచ్ ఆడనున్న విషయం తెలిసిందే.


