News August 22, 2025

పెద్దపల్లి: ‘భూ సమస్యలకు కలెక్టరేట్‌కు రావాల్సిన పనిలేదు’

image

పెద్దపల్లి జిల్లాలో భూ సమస్యల పరిష్కారం కోసం రైతులు కలెక్టరేట్‌కు రావాల్సిన అవసరం లేదని కలెక్టర్ శ్రీహర్ష తెలిపారు. మార్కెట్ విలువ రూ. 5 లక్షలలోపు ఉన్న మిస్సింగ్ సర్వే నంబర్లు, భూ విస్తీర్ణ సవరణ, పట్టా పాస్‌బుక్ డిజిటల్ సైన్, నాలా వంటి అంశాలు నేరుగా ఆర్డీఓ కార్యాలయంలోనే పరిష్కారమవుతాయని ఆయన పేర్కొన్నారు.

Similar News

News January 17, 2026

గ్రేటర్ వరంగల్ ఇక అందరిదీ!

image

గ్రేటర్ వరంగల్ నగర పాలక సంస్థ జనరల్‌కు రిజర్వ్ అయ్యింది. గ్రేటర్‌లో 66 డివిజన్లు, 11 లక్షల జనాభా ఉంది. ప్రస్తుతం 66 డివిజన్లు ఉండగా 88 డివిజన్లకు పెంచాలని అనుకున్నారు. అనుహ్యంగా 66 డివిజన్లకు రిజర్వేషన్లు ప్రకటించారు. తాజాగా గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్‌ను జనరల్‌కు కేటాయించగా, ప్రస్తుతం బీసీ మహిళకు కేటాయించారు. ఇకపై పోటీ భారీగానే ఉంటుందని అంచనా వేస్తున్నారు.

News January 17, 2026

లక్కీ డ్రా ఇన్‌ఫ్లుయెన్సర్ల పట్ల జాగ్రత్త: సీపీ సజ్జనార్

image

సోషల్ మీడియాలో కొంతమంది ఇన్‌ఫ్లుయెన్సర్లు కార్లు, బైకులు ఇస్తామంటూ లక్కీ డ్రాల పేరుతో మోసాలు చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని హైదరాబాద్ సీపీ సజ్జనార్ తెలిపారు. బెట్టింగ్ యాప్ ప్రమోషన్ల దందా బంద్ కావడంతో లక్కీ డ్రాలు అంటూ కొత్త వేషాలతో వీళ్లు దర్శనమిస్తున్నారని ఫైరయ్యారు. అమాయకపు ప్రజల ఆశను ఆసరాగా చేసుకొని నిండా ముంచుతున్న ఇన్ఫ్లూయెన్సర్లపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని సీపీ హెచ్చరించారు.

News January 17, 2026

మేడ్చల్ జిల్లాలో వ్యవసాయమే జీవనాధారం..!

image

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా వ్యాప్తంగా వ్యవసాయ రంగమే ప్రధాన జీవనాధారంగా సుమారు 40,872 మంది రైతులు, 19,000 మంది వ్యవసాయ కూలీలు జీవనం కొనసాగిస్తున్నారని అధికారిక గణాంకాలు వెల్లడిస్తున్నాయి. జిల్లా గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో వ్యవసాయం కీలక పాత్ర పోషిస్తుందని.. రైతులు, కూలీలపై ఆధారపడి అనేక కుటుంబాలు జీవిస్తున్నాయని ఈ వివరాలు స్పష్టం చేస్తున్నాయి.