News December 1, 2025
పెద్దపల్లి: ‘భూ సేకరణ పనులు వారం రోజులలో పూర్తి చేయాలి’

పెండింగ్‌లో ఉన్న భూ సేకరణ పనులను వారం రోజుల్లోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష అధికారులను ఆదేశించారు. సోమవారం సమీకృత జిల్లా కలెక్టరేట్‌లో శ్రీపాద ఎస్.డి.ఆర్, జాతీయ రహదారుల కోసం చేపట్టాల్సిన భూ సేకరణ పనులపై ఆయన సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. భూ సేకరణ ప్రక్రియలో జాప్యం లేకుండా వేగవంతం చేయాలని, దీనికి సంబంధించి పూర్తి నివేదిక ఇవ్వాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు.
Similar News
News February 14, 2026
TODAY HEADLINES

*TG: మున్సిపల్ ఎన్నికల్లో సత్తా చాటిన కాంగ్రెస్
*ఈ విజయం మా బాధ్యతను పెంచింది: రేవంత్
*గెలిచిన మా అభ్యర్థులను లాక్కునే ప్రయత్నం: KTR
*BJPకి ఓట్ల శాతం పెరిగింది: రామ్‌చందర్ రావు
*AP: నీటి సమస్యపై 2 తెలుగు రాష్ట్రాలు ఇచ్చిపుచ్చుకునేలా ఉండాలి: CBN
*ఏప్రిల్ 1 నుంచి నేతన్నలకు ఉచిత విద్యుత్
*PMO ఇకపై సేవా తీర్థ్.. ప్రారంభించిన మోదీ
*T20 WCలో ఆస్ట్రేలియాను ఓడించిన జింబాబ్వే
News February 14, 2026
రేపే బడ్జెట్

AP: రేపు రాష్ట్ర వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. 10.30amకు CM CBN అధ్యక్షతన క్యాబినెట్ భేటీ అయి బడ్జెట్‌కు ఆమోదం తెలపనుంది. 11.15amకు శాసనసభ, మండలి ప్రారంభం కానున్నాయి. అసెంబ్లీలో పయ్యావుల బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. వ్యవసాయ అనుబంధ రంగాలపై అచ్చెన్న బడ్జెట్ ప్రవేశపెడతారు. మండలిలో హోంమంత్రి అనిత బడ్జెట్ ప్రవేశపెట్టనున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. అనంతరం ఉభయసభలు వాయిదా పడతాయి.
News February 14, 2026
వరంగల్ కమిషనరేట్ పరిధిలో కానిస్టేబుళ్ల బదిలీలు

వరంగల్ కమిషనరేట్ పరిధిలో సుదీర్ఘ కాలంగా ఒకే చోట విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుళ్లను బదిలీ చేస్తూ సీపీ సన్‌ప్రీత్ సింగ్ ఉత్తర్వులు జారీ చేశారు. వివిధ పోలీస్ స్టేషన్లు, విభాగాల్లో పనిచేస్తున్న మహిళా కానిస్టేబుళ్లతో పాటు మొత్తం 59 మందిని ఇతర ప్రాంతాలకు మార్చారు. పరిపాలనా సౌలభ్యం కోసమే ఈ బదిలీలు చేపట్టినట్లు పేర్కొన్నారు. బదిలీ అయిన వారు తక్షణమే కొత్త ప్రాంతాల్లో విధుల్లో చేరాలని ఆదేశించారు.


