News March 8, 2025

పెద్దపల్లి: మార్చి 12న జాబ్‌మేళా

image

జిల్లాలోని నిరుద్యోగ యువతకు హైదరాబాద్‌లోని పేటీఎం సర్వీస్‌లో ఉద్యోగాలు కల్పించడానికి ఈనెల 12న పెద్దపల్లి కలెక్టరేట్‌లో జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి అధికారి తిరుపతిరావు తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులు రూమ్ నంబర్ 225 బుధవారం ఉదయం 11గంటలకు సంబంధిత పత్రాలు జిరాక్సులతో హాజరవ్వాలని సూచించారు. మరిన్ని వివరాలకు 7013188805, 8985336947, 8121262441 నంబర్లను సంప్రదించాలని సూచించారు.

Similar News

News December 12, 2025

TU: ఈ నెల 24వ తేదీలోపు పరీక్షల ఫీజు చెల్లించాలి: COE

image

తెలంగాణ యూనివర్సిటీ పరిధిలోని చదువుతున్న పీజీ M.A/MSW/M.Sc/M.Com/MBA/MCA 3వ సెమిస్టర్, ఇంటిగ్రేటెడ్ పీజీ (APE/PCH) 3, 5 సెమిస్టర్ల ఇంటిగ్రేటెడ్ PG(IMBA) 3, 5, 9 సెమిస్టర్ల రెగ్యులర్ పరీక్షల ఫీజు చెల్లించాలని కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఆచార్య సంపత్ కుమార్ తెలిపారు. ఈ నెల 24వ తేదీ లోపు విద్యార్థులు ఫీజు చెల్లించాలన్నారు. వివరాలకు యూనివర్సిటీ వెబ్‌సైట్ సందర్శించాలన్నారు.

News December 12, 2025

నేను, గిల్ అలా చేసి ఉండాల్సింది: సూర్య

image

ఛేజింగ్‌లో తాను, గిల్ మంచి స్టార్ట్ ఇవ్వాల్సిందని SAతో 2వ T20లో ఓటమి తర్వాత IND కెప్టెన్ సూర్య అన్నారు. ప్రతిసారి అభిషేక్ మీద ఆధారపడలేమని, అతని ఆఫ్ డే అయినప్పుడు ఇలాంటి పరిస్థితులే ఎదురవుతాయని చెప్పారు. తనతో పాటు గిల్, మిగతా బ్యాటర్లు ఇది అర్థం చేసుకోవాల్సిందని అభిప్రాయపడ్డారు. తానైనా బాధ్యత తీసుకొని మరింత సేపు బ్యాటింగ్ చేయాల్సిందని చెప్పారు. తొలి టీ20లోనూ గిల్, SKY పేలవ ప్రదర్శన కనబరిచారు.

News December 12, 2025

TU: ఈ నెల 22లోపు LLB, LLM పరీక్షా ఫీజు చెల్లించాలి: COE

image

తెలంగాణ యూనివర్సిటీ పరిధిలోని చదువుతున్న LLB 1, 3, 5 సెమిస్టర్ల, LLM 1, 3 సెమిస్టర్ల రెగ్యులర్ (థియరీ&ప్రాక్టికల్) పరీక్షల ఫీజు చెల్లించాలని కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఆచార్య సంపత్ కుమార్ తెలిపారు. ఈ మేరకు ఆయన ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నెల 22వ తేదీ లోపు విద్యార్థులు సంబంధిత కళాశాలలో ఫీజు చెల్లించాలన్నారు. వివరాలకు యూనివర్సిటీ వెబ్సైట్ సందర్శించాలన్నారు.