News February 8, 2025
పెద్దపల్లి: యూరియా అందుబాటులో ఉంది: కలెక్టర్

పెద్దపల్లి జిల్లాలోయూరియా నిల్వలు సరిపడా అందుబాటులో ఉన్నాయని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష తెలిపారు. యాసంగిలో రైతుల అవసరాలను పరిగణనలోకి తీసుకుని 37,000 మెట్రిక్ టన్నుల యూరియా అవసరమవుతుందని ప్రణాళిక తయారు చేసినట్టు తెలిపారు. జిల్లాలో యూరియా ఇబ్బంది లేదని ఆయన పేర్కొన్నారు. యూరియా కోసం మండల వ్యవసాయ అధికారిని సంప్రదించవచ్చన్నారు.
Similar News
News February 7, 2026
జర్నలిస్టులు అక్రెడిటేషన్లకు దరఖాస్తు చేసుకోవాలి: కలెక్టర్

నిర్మల్ జిల్లాలో 2026-28 సంవత్సరాలకు గాను జర్నలిస్టుల అక్రెడిటేషన్ కార్డుల జారీకి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు కలెక్టర్ అభిలాష అభినవ్ తెలిపారు. ఈనెల 9 నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని శనివారం పేర్కొన్నారు. ప్రస్తుతం ఉన్న కార్డుల గడువు ఈనెల 28తో ముగియనుందని, అర్హులైన జర్నలిస్టులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు. నిబంధనల ప్రకారం నూతన కార్డులు జారీ చేస్తామని స్పష్టం చేశారు.
News February 7, 2026
ఇస్లామాబాద్‌లో దాడి చేసింది మేమే: ఐసిస్

పాకిస్థాన్‌లోని ఇస్లామాబాద్‌లో జరిగిన <<19072203>>ఆత్మాహుతి దాడి <<>>తమ పనేనని ఇస్లామిక్ స్టేట్(ఐసిస్) ప్రకటించింది. ‘మసీదులోకి వెళ్లేందుకు యత్నించిన మా ఫైటర్‌ను గార్డులు అడ్డుకున్నారు. దీంతో ప్రజలు గుమిగూడిన చోట అతడు తనను తాను పేల్చేసుకున్నాడు’ అని ఓ ప్రకటనలో తెలిపింది. అటాక్ చేసిన వారిని చట్టం ముందు నిలబెడతామని పాక్ PM షరీఫ్ ట్వీట్ చేశారు. ఉగ్రవాదాన్ని ఓడించాలనే తమ సంకల్పానికి కట్టుబడి ఉన్నామని పేర్కొన్నారు.
News February 7, 2026
జనగామను వీడిన పులి.. సిద్దిపేట జిల్లాలోకి ఎంటర్

మూడు రోజులుగా జనగామ జిల్లా ప్రజలను భయాందోళనకు గురి చేసిన పెద్ద పులి సిద్దిపేట జిల్లాలోకి ప్రవేశించిందని డీఎఫ్ఓ లావణ్య వెల్లడించారు. గురువారం అర్ధరాత్రి రఘునాథపల్లి మండలంలో సంచరించిన పులి శుక్రవారం అర్ధరాత్రి నర్మెట్ట మండలం మీదుగా సిద్దిపేట జిల్లాలోకి వెళ్లిందని తెలిపారు. ఏదేమైనా పులి చిక్కేంత వరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.


