News September 12, 2025
పెద్దపల్లి: రైల్వే ప్రయాణికులకు తిరుపతి వీక్లీ ట్రైన్

చర్లపల్లి- రక్సాల్ మధ్య రైలు నం.07051/52 రాకపోకలు సాగిస్తుంది. రైలు నం.07051 ఈనెల 20న తిరుపతి నుంచి ప్రారంభమై ప్రతి శనివారం వికారాబాద్, లింగంపల్లి, సికింద్రాబాద్, చర్లపల్లి, కాజీపేట, PDPL, మంచిర్యాలలో స్టాప్లలో ఆగుతూ వెళ్లనుంది. రైలు నం.07052 ఈనెల 23న ప్రారంభమై ప్రతి మంగళవారం రక్సాల్ నుంచి తిరుపతికి రాకపోకలు సాగిస్తుందని రైల్వే శాఖ అధికారులు తెలిపారు. పండగల దృష్ట్యా దీనిని వినియోగించుకోవాలన్నారు.
Similar News
News December 5, 2025
నల్గొండ: పంచాయతీ ఎన్నికల్లో ఇంటి పోరు!

ఉమ్మడి నల్గొండ జిల్లాలో జరుగుతున్న గ్రామ పంచాయతీ ఎన్నికల్లో అధికార, ప్రతిపక్ష పార్టీలకు ఇంటిపోరు తలనొప్పిగా మారింది.పలు గ్రామాల్లో ఒక్కో పార్టీ నుంచి ఇద్దరి నుంచి ముగ్గురిపైనే సర్పంచ్ స్థానాలకు పోటీ పడుతున్నారు. పెద్దఎత్తున నామినేషన్లు రావడంతో కొందరు విత్ డ్రా చేసుకున్నప్పటికీ మరికొందరు నేతలు విరమించేందుకు యత్నాలు చేసినా పట్టించుకోవడం లేదు. చాలాచోట్ల ఒకే పార్టీకి చెందిన అభ్యర్థులు రంగంలోకి దిగారు.
News December 5, 2025
నెల్లూరు: భారీ వర్షాలకు ఒకరు మృతి.. మరొకరు గల్లంతు..

నెల్లూరు ప్రాంతంలో కురిసిన భారీ వర్షాలు రెండు నిండు ప్రాణాలను బలి తీసుకున్నాయి. నెల్లూరు పొర్లుకట్ట ప్రాంతానికి చెందిన ఇంటర్ విద్యార్థి మస్తాన్ గురువారం పొట్టెపాలెం కలుజులో పడి మృతి చెందాడు. నెల్లూరు శివారు ప్రాంతం కొండ్లపూడికి చెందిన రవికుమార్ బుధవారం సాయంత్రం నెల్లూరు కాలువలో గల్లంతయ్యారని సమాచారం. తండ్రి గల్లంతైనట్లు రవికుమార్ కుమార్తె కావ్య గురువారం నెల్లూరు రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
News December 5, 2025
జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

<


