News August 14, 2025
పెద్దపల్లి: ‘విద్యార్థులకు అవగాహన కల్పించాలి’

జిల్లాలో ఉన్న ప్రాంతీయ టాస్క్ సెంటర్ ద్వారా అందించే కోర్సులపై విద్యార్థులకు అవగాహన కల్పించాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. బుధవారం కలెక్టరేట్‌లో యువతకు ఉపాధి కల్పనపై డిగ్రీ, ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపల్ లతో సమీక్ష నిర్వహించారు. డిగ్రీ, ఇంజనీరింగ్ ముగిసిన విద్యార్దులు టాస్క్ కోర్సులలో నమోదు చేసుకోవాలన్నారు. టామ్ కామ్ ద్వారా విదేశాలలో ఉద్యోగ అవకాశాలను అందిపుచ్చు కోవాలని సూచించారు.
Similar News
News March 16, 2026
కర్ణాటక తరలిపోతున్న పెద్దేముల్ సంపద!

పెద్దేముల్ మండల పరిధిలోని పాషాపూర్, రాంసింగ్ తండా తదితర ప్రాంతాల్లో ఎర్రరాయి అక్రమ వ్యాపారం యథేచ్ఛగా కొనసాగుతోంది. అధికారులు ఎవరూ అటువైపు కన్నెత్తి చూడకపోవడంతో అక్రమార్కులు సహజమైన సంపదను దోచేస్తున్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా ఎర్రరాయిని వెలికితీసి కర్ణాటకకు తరలించుకుపోతున్నారు. ఇంత జరుగుతున్నా అధికారులు తమకేమీ పట్టనట్లుగా వ్యవహరించడం పట్ల పలు అనుమానాలకు తావిస్తోంది.
News March 16, 2026
FLASH: తగ్గిన బంగారం ధర

బంగారం ధర క్రమంగా దిగొస్తోంది. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ఇవాళ రూ.490 తగ్గి రూ.1,59,170కు చేరింది. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.450 పతనమై రూ.1,45,900 పలుకుతోంది. తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో ధరల్లో స్వల్ప తేడాలుండొచ్చు.
News March 16, 2026
గంట మోగించేటప్పుడు పాటించాల్సిన కొన్ని నియమాలు

ఆలయంలోకి ప్రవేశించేటప్పుడు మాత్రమే గంట కొట్టాలి. తిరిగి వచ్చేటప్పుడు కొట్టకూడదు. ఇంట్లో పూజ చేసేటప్పుడు గంటను ఎడమ చేతితో పట్టుకుని లయబద్ధంగా మోగించాలి. అనవసరంగా, పదేపదే కొట్టకూడదు. 2,3 సార్లు స్పష్టంగా మోగించడం శ్రేయస్కరం. రాత్రి సమయాల్లో గంటను బిగ్గరగా మోగించకూడదు. ఈ నియమాలను పాటిస్తే దేవతల ఆవాహన జరగడమే కాకుండా, ఆ ప్రతిధ్వని ద్వారా మనసు ఏకాగ్రతను పొంది ఇంట్లో సానుకూల ప్రకంపనలు వ్యాపిస్తాయి.


