News August 22, 2025

పెద్దపల్లి: ‘విద్యార్థులకు సులభంగా అర్థమయ్యేలా బోధన ఉండాలి’

image

పెద్దపల్లి కలెక్టర్ కోయ శ్రీహర్ష హై స్కూల్ విద్యాబోధనపై ప్రత్యేకదృష్టి సారించాలని సూచించారు. 6-9వ తరగతి విద్యార్థులకు సబ్జెక్టులను బేసిక్ స్థాయిలో, సులభంగా అర్థమయ్యే విధంగా బోధించాలని, పాఠ్యాంశాలపై కనీస పరిజ్ఞానం 80% విద్యార్థులకు ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఉపాధ్యాయులు ప్రతి పాఠ్యాంశానికి సంబంధించి TLM తయారీ, బోధన విధానాల మెరుగుదల సూచనలపై జిల్లా విద్యాశాఖ పూర్తి సహకారం అందిస్తుందన్నారు.

Similar News

News January 16, 2026

గద్వాల్: మైనారిటీ గురుకుల విద్యాలయాల్లో దరఖాస్తులకు ఆహ్వానం

image

మైనారిటీ గురుకుల విద్యాలయాల్లో 2026- 2027 విద్యా సంవత్సరంలో అర్హులైన విద్యార్థుల ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ బీఎం సంతోష్ తెలిపారు. శుక్రవారం కలెక్టర్ కార్యాలయంలో తెలంగాణ మైనారిటీస్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ సొసైటీ గురుకులాల్లో విద్యార్థుల ప్రవేశాలకు సంబంధించిన గోడపత్రికలను సంబంధిత అధికారులతో కలిసి కలెక్టర్ విడుదల చేశారు.

News January 16, 2026

చనాక-కోరట ప్రాజెక్టు.. 51 వేల ఎకరాలకు సాగునీరు

image

దిగువ పెనుగంగపై తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దున చనాక-కోరట ప్రాజెక్టును నిర్మించారు. 2016లో మహారాష్ట్ర ప్రభుత్వంతో అంతర్రాష్ట్ర ఒప్పందం కుదుర్చుకొని ప్రాజెక్టు పనులను మొదలుపెట్టారు. 0.98 టీఎంసీల నీటి నిలువ సామర్థ్యంతో ప్రాజెక్ట్, దాని సమీపంలో హత్తి ఘాట్ వద్ద పంపు హౌస్ నిర్మించారు. దీని ద్వారా ఆదిలాబాద్, బోథ్ నియోజకవర్గాలలోని సుమారు 51 వేల ఎకరాలకు సాగునీరు అందనుంది.

News January 16, 2026

రూ.13 వేల కోట్ల ప్లాంట్.. రేపే శంకుస్థాపన!

image

కాకినాడ రూరల్‌లో రూ.13 వేల కోట్లతో నిర్మించనున్న గ్రీన్ అమోనియా ప్లాంట్‌కు శనివారం సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ శంకుస్థాపన చేయనున్నారు. ఈ మేరకు శుక్రవారం ఎంపీ సానా సతీశ్, ఎమ్మెల్యే కొండబాబు, ఇన్‌ఛార్జ్ కలెక్టర్ అపూర్వ భరత్ ఏర్పాట్లను సమీక్షించారు. సీఎం కార్యక్రమాల సమన్వయకర్త పెందుర్తి వెంకటేశ్ ప్లాంట్ వద్ద పనులను పరిశీలించి అధికారులకు సూచనలు చేశారు.