News December 15, 2025

పెద్దపల్లి: వీ- హబ్ పనులు వెంటనే పూర్తి చేయాలి: కలెక్టర్

image

పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష సోమవారం రంగంపల్లిలో నిర్మిస్తున్న కొత్త వీ- హబ్ భవనాన్ని పరిశీలించారు. సీసీ కెమెరాలు, ఏసీలు తదితర పెండింగ్ పనులు 3 రోజుల్లో పూర్తిచేయాలని సూచించారు. కాగా, మహిళలకు పారిశ్రామిక శిక్షణ, అవగాహన కార్యక్రమాలు నిర్వహించడానికి ఈ భవనం ఉపయోగపడనుంది. ఈ పర్యటనలో గ్రామీణ అభివృద్ధి అధికారి కాళిందిని, పంచాయతీరాజ్ అసిస్టెంట్ ఇంజినీర్ పవన్, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Similar News

News January 23, 2026

ADB జిల్లాలో క్షయ నివారణకు పకడ్బందీ చర్యలు: కలెక్టర్

image

క్షయ వ్యాధి నిర్మూలనలో మీడియా పాత్ర ఎంతో కీలకమని, తప్పుడు సమాచారాన్ని అరికట్టి ప్రజల్లో సరైన అవగాహన కల్పించాలని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. శుక్రవారం ఆదిలాబాద్ కలెక్టరేట్ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. టీబీ చికిత్స విజయవంతం కావడానికి ముందస్తు నిర్ధారణ, టీబీ ప్రివెంటివ్ థెరపీ, పోషకాహార మద్దతు అవసరమని తెలిపారు. టీబీ వ్యాధి జయించిన పలువురిని శాలువాతో సత్కరించారు.

News January 23, 2026

1.2 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ: కలెక్టర్

image

రైతుల నుంచి 1.2 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించినట్లు బాపట్ల కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ శుక్రవారం తెలిపారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకున్నామన్నారు. ఈ-పార్కుల నిర్మాణం, పరిశ్రమల స్థాపనకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. విద్యార్థులకు మెరుగైన విద్య అందించడానికి సమగ్ర ప్రణాళికతో ముందుకు వెళ్తున్నామని వివరించారు. క్షయ, HIV బాధితులకు పౌష్టికాహారం అందేలా చర్యలు చేపడతామన్నారు.

News January 23, 2026

ఆదిలాబాద్: గవర్నర్ అవార్డ్స్ ఫర్ ఎక్సలెన్స్ అవార్డుకు తొడసం కైలాష్ ఎంపిక

image

గవర్నర్ అవార్డ్స్ ఫర్ ఎక్సలెన్స్- 2025 అవార్డుకు ఆదివాసీ రచయిత తొడసం కైలాస్ ఎంపికయ్యారని తెలంగాణ స్పెషల్ చీఫ్ సెక్రటరీ టు గవర్నర్ ఒక ప్రకటనలో తెలిపారు. జనవరి 26 గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాజ్ భవన్‌లో గవర్నర్ చేతుల మీదుగా అవార్డు స్వీకరించనున్నారు. రూ.20 వేల నగదుతోపాటుగా ఘనంగా సత్కరించనున్నట్లు తెలిపారు. తొడసం కైలాష్ మాట్లాడుతూ.. గిరిజన అభివృద్ధి విభాగంలో అవార్డు రావడం సంతోషంగా ఉందన్నారు.