News November 7, 2025

పెద్దపల్లి: సూపర్వైజర్లకు స్పష్టమైన దిశానిర్దేశం

image

పెద్దపల్లి జిల్లా వైద్యాధికారి డా. వాణిశ్రీ అధ్యక్షతన సూపర్వైజర్లతో శుక్రవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆరోగ్య కార్యక్రమాల అమలులో సూపర్వైజర్లు కీలకపాత్ర వహించాలని ఆమె సూచించారు. గర్భిణీల ఎర్లీ రిజిస్ట్రేషన్, ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాల ప్రోత్సాహం, మలేరియా-డెంగ్యూ నివారణ, NCD డేటా నమోదు, 100% టీకాల అమలుపై దృష్టి పెట్టాలని ఆదేశించారు. సమావేశంలో జిల్లా వైద్య అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Similar News

News January 20, 2026

9 రోజుల పాటు విశాఖ ఉత్సవం

image

విశాఖ ఉత్సవాలను ఈనెల 24వ తేదీ నుంచి నిర్వహించనున్నారు. తొమ్మిది రోజులు పాటు జరిగే ఈ ఉత్సవాలకు సంబంధించిన ఏర్పాట్లపై నేడు సమీక్షించారు. మంత్రులు కందుల దుర్గేశ్, కొల్లు రవీంద్ర, హోంమంత్రి అనితతో పాటు MP శ్రీభరత్, ఉమ్మడి జిల్లాల MLAలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఉత్సవాల్లో చేపట్టవలసిన అంశాలను ఉమ్మడి జిల్లా కలెక్టర్లకు, అధికారులకు వివరించారు. విశాఖ బ్రాండ్ ఇమేజ్ మరింత పెరిగేలా ఉత్సవాలు జరగాలన్నారు.

News January 20, 2026

పెద్దపల్లి: ‘రోడ్డు ప్రమాదాల నియంత్రణకు కఠిన చర్యలు’

image

PDPL జిల్లాలో రోడ్డు ప్రమాదాల నియంత్రణకు పటిష్ట చర్యలు చేపట్టాలని మంగళవారం కలెక్టర్ కోయ శ్రీహర్ష అధికారులను ఆదేశించారు. బ్లాక్‌స్పాట్ల గుర్తింపు, స్పీడ్‌బ్రేకర్లు, రోడ్డు స్ట్రిప్స్, రేడియం స్టిక్కర్లు ఏర్పాటు చేయాలని సూచించారు. కేజీ వీల్స్ వాడే వాహనాలకు భారీ జరిమానాలు విధించి, మళ్లీ వాడితే సీజ్ చేయాలన్నారు. పశువులను రోడ్లపై వదిలితే రూ.10వేలు జరిమానా, డ్రంక్ & డ్రైవ్ తనిఖీలు పెంచాలని ఆదేశించారు.

News January 20, 2026

HYD: ట్రాఫిక్ పోలీసుల సేఫ్టీ.. స్టైలిష్ లుక్!

image

రోడ్లపై నిలబడి ఎండ, ధూళితో కుస్తీ పట్టే మన ట్రాఫిక్ అన్నలకు ఇప్పుడు అదిరిపోయే రక్షణ దొరికింది. సైబరాబాద్ జాయింట్ CP గజరావు భూపాల్ చేతుల మీదుగా సిబ్బందికి స్పెషల్ గాగుల్స్ పంపిణీ చేశారు. ఎండ వేడిమి, కాలుష్యం నుంచి కళ్లను కాపాడుకుంటేనే, పోలీసులు ప్రజలకు మెరుగైన సేవలు అందించగలరని ఆయన ఈ సందర్భంగా నొక్కి చెప్పారు. ఇప్పుడు మన ట్రాఫిక్ పోలీసులు హెల్తీగా, స్టైలిష్‌గా డ్యూటీ చేయబోతున్నారు.