News September 11, 2025

పెద్దపల్లి: ‘సెప్టెంబర్ 16న జాబ్‌మేళా’

image

నిరుద్యోగ యువకుల కోసం సెప్టెంబర్ 16న పెద్దపల్లి కలెక్టరేట్‌లో జాబ్‌మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి అధికారి తిరుపతిరావు తెలిపారు. గూగుల్ పే, హైరింగ్ రిక్వెస్ట్ కంపెనీలో 20 ఫీల్డ్ సేల్స్ ఎగ్జిక్యూటివ్ ఖాళీలు ఉన్నాయన్నారు. బైక్, పాన్ కార్డు, ఆండ్రాయిడ్ మొబైల్ తప్పనిసరి. ఇంటర్/డిగ్రీ ఉత్తీర్ణతతో 18-35 ఏళ్ల వయసు గల వారు అర్హులు. ఆసక్తి గల వారు సర్టిఫికేట్స్ జిరాక్స్‌లతో హాజరుకావాలని సూచించారు.

Similar News

News December 17, 2025

కొండెక్కిన వెండి ధరలు

image

వెండి ధరలు సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. ఇవాళ ఒక్కరోజే కేజీపై ఏకంగా రూ.11వేలు పెరిగింది. దీంతో ఓవరాల్ రేట్ రూ.2,22,000కు చేరింది. అటు బంగారం ధరలు కూడా మళ్లీ పెరిగాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేట్ రూ.650 పెరిగి రూ.1,34,510గా నమోదైంది. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.600 పెరిగి రూ.1,23,300కు చేరింది.

News December 17, 2025

పెద్దపల్లి: ఉదయం 9 వరకు పోలింగ్ ఎంతంటే..?

image

పెద్దపల్లి జిల్లాలో మూడో విడత గ్రామపంచాయతీ ఎన్నికల్లో బుధవారం ఉదయం 9 వరకు 22.50 శాతం పోలింగ్ నమోదైంది. ఎలిగేడు మండలంలో 22.56 శాతం, ఓదెల మండలంలో 19.50 శాతం, పెద్దపల్లి మండలంలో 21.80 శాతం, సుల్తానాబాద్ మండలంలో 26.08 శాతం పోలింగ్ రికార్డైంది.

News December 17, 2025

ఇందల్వాయి హత్య.. పోలీసుల అదుపులో అనుమానితులు

image

నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలం దేవితండా సమీపంలో ఓ దాబా వద్ద నిన్న మహ్మద్ సల్మాన్ అనే <<18587725>>లారీ డ్రైవర్ <<>>హత్యకు గురైన సంగతి తెలిసిందే. కాల్పుల్లో సల్మాన్ అక్కడికక్కడే మృతి చెందాడని ప్రచారం జరగగా అనుమానితులను ఇందల్వాయి పోలీసులు అదుపులో తీసుకున్నారు. చంద్రయన్ పల్లి వద్ద నిందితులు కనిపించగా స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో వారిని అదుపులోకి తీసుకున్నారు.