News September 13, 2025

పెద్దపల్లి: సెప్టెంబర్ 30 వరకు ఐటీఐ కోర్సుల వాక్-ఇన్ అడ్మిషన్లు

image

TG ఉపాధి & శిక్షణ విభాగం ప్రకటించిన నోటిఫికేషన్ ప్రకారం రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్, మైనారిటీ ITIలు, ATCsలో సెప్టెంబర్ 2025 సెషన్‌కు వాక్-ఇన్ అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి. 8వ/10వ తరగతి పాసైన, 14 ఏళ్లు పైబడిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్ దరఖాస్తులు సెప్టెంబర్ 30 వరకు iti.telangana.gov.inలో అందుబాటులో ఉన్నాయి. ఎంపిక వెబ్ ఆప్షన్ల ఆధారంగా జరుగుతుంది. వివరాలకు PDPL ITIను సంప్రదించండి.

Similar News

News December 7, 2025

కృష్ణా: రైలు ప్రయాణికులకు ఊరట కలిగించే వార్త

image

ఉమ్మడి కృష్ణా జిల్లా మీదుగా హైదరాబాద్(HYB)-భువనేశ్వర్(BBS) మధ్య నడుస్తున్న ప్రత్యేక రైళ్లను పొడిగించామని రైల్వే అధికారులు తెలిపారు. నం.07165 HYB-BBS రైలును 2026 JAN 27 వరకు ప్రతి మంగళవారం, నం.07166 BBS- HYB మధ్య నడిచే రైలును 2026 JAN 28 వరకు ప్రతి బుధవారం నడిచేలా పొడిగించామన్నారు. ఈ రైళ్లు ఉమ్మడి కృష్ణాలో విజయవాడ, గుడివాడ, కైకలూరు స్టేషన్‌లలో ఆగుతాయన్నారు.

News December 7, 2025

వర్చువల్ బ్రెయిన్‌ను తయారు చేసిన సూపర్‌కంప్యూటర్

image

బ్రెయిన్ పనితీరు, అల్జీమర్స్‌పై స్టడీకి సూపర్‌కంప్యూటర్ సహాయంతో సైంటిస్ట్స్ వర్చువల్ మౌస్ బ్రెయిన్‌ తయారు చేశారు. USలోని అలెన్ ఇనిస్టిట్యూట్, యూనివర్సిటీ ఆఫ్ ఎలక్ట్రో-కమ్యూనికేషన్స్ జపాన్ ఎక్స్‌పర్ట్‌లు 9మిలియన్ న్యూరాన్లు, 26బిలియన్ల సినాప్సెస్‌తో చేసిన కార్టెక్స్‌ సెకనుకు క్వాడ్రిలియన్ లెక్కలు చేయగలదు. హ్యూమన్ బ్రెయిన్‌ కంటే ఎలుక మెదడు చిన్నది, తక్కువ సంక్లిష్టమైనదైనా చాలా పోలికలుంటాయి.

News December 7, 2025

నంద్యాలలో కార్డెన్ సెర్చ్ ఆపరేషన్

image

నంద్యాల జిల్లా వ్యాప్తంగా జిల్లా ఎస్పీ సునీల్ షొరాణ్ ఆదేశాల మేరకు పోలీసులు కార్డెన్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. ప్రజల రక్షణ, భద్రతకు భరోసా కల్పించేందుకు, చట్ట వ్యతిరేక కార్యకలాపాలను అరికట్టేందుకు కార్డెన్ సెర్చ్ ఆపరేషన్ ఉపయోగ పడుతుందన్నారు. నంద్యాల MS నగర్, VC కాలనీ, బ్రాహ్మణ కొట్కూరు పరిధిలోని కోళ్లబవాపురం గ్రామం, పాములపాడు పరిధిలోని మిట్టకందాల గ్రామంలో సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు.