News September 12, 2025

పెద్దపల్లి సెషన్స్ కోర్టు పీపీగా కనగర్తివాసి

image

పెద్దపల్లి మండలంలోని కనగర్తికి చెందిన అరెల్లి రాములు ప్రస్తుతం కరీంనగర్ రెండో అదనపు సెషన్స్ కోర్టు అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ పని చేస్తున్నారు. ఆయనను పెద్దపల్లి సెషన్స్ కోర్టు ఇన్ఛార్జి పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా నియమిస్తూ డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్(ఎఫ్ఏసీ) ఎస్.సాంబశివారెడ్డి గురువారం నియామక ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో మండలంలోని పలువురు ఆయనను అభినందించారు.

Similar News

News December 14, 2025

బీజేపీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నితిన్ నబీన్

image

బీజేపీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నితిన్ నబీన్ నియమితులయ్యారు. ప్రస్తుతం ఆయన బిహార్ మంత్రిగా ఉన్నారు. అటు UP BJP అధ్యక్షుడిగా కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ప్రస్తుత అధ్యక్షుడు భూపేంద్ర చౌదరి స్థానంలో పంకజ్ చౌదరి బాధ్యతలు స్వీకరించారు. ఈయన 7 సార్లు ఎంపీగా గెలిచారు.

News December 14, 2025

త్రిపురారం: రాష్ట్రంలోనే చిన్న పంచాయతీ.. ఎవరు గెలిచారంటే..

image

బృందావనపురం సర్పంచ్‌గా కాంగ్రెస్ బలపరిచిన మందడి రమణారెడ్డి విజయం సాధించారు. తన ప్రత్యర్థి, బీఆర్ఎస్ బలపరిచిన వంగాల శ్రీనివాస్ రెడ్డిపై ఏడు ఓట్ల తేడాతో రమణారెడ్డి విజయం సాధించారు. రమణారెడ్డి విజయం సాధించడంతో కాంగ్రెస్ శ్రేణులు, మద్దతుదారులు సంబరాలు జరుపుకుంటున్నారు. బృందావనపురం గ్రామపంచాయతీ రాష్ట్రంలోనే అతి చిన్న గ్రామపంచాయతీ కావడం విశేషం. ఇక్కడ కేవలం 98 ఓట్లు మాత్రమే ఉన్నాయి.

News December 14, 2025

మెదక్: 2వ విడత 88.80% పోలింగ్

image

మెదక్ జిల్లాలో రెండవ విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్‌లో 88.80% పోలింగ్ నమోదైంది.
చేగుంట 87.86%, మనోహరాబాద్ 90.35%, మెదక్ 91.64 %, నార్సింగి 89.01%, నిజాంపేట్ 85.27%, రామాయంపేట్ 88.42%, శంకరంపేట్ (ఆర్) 89.68%, తూప్రాన్ 87.98 % పోలింగ్ నమోదైంది. కలెక్టర్ రాహుల్ రాజ్, ఎస్పీ శ్రీనివాస్ రావు పర్యవేక్షించారు.