News September 13, 2025
పెద్దపల్లి: స్వచ్ఛత హి సేవ 2025 పోస్టర్ ఆవిష్కరణ

సమీకృత కలెక్టరేట్‌లో కలెక్టర్ కోయ శ్రీహర్ష స్వచ్ఛత హి సేవ 2025 పోస్టర్‌ను ఈరోజు ఆవిష్కరించారు. స్వచ్ఛత హి సేవ కార్యక్రమంలో ప్రతీ ఒక్కరూ భాగస్వామ్యం కావాలన్నారు. ఇంటి పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా పలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జడ్పీ సీఈఓ నరేందర్, DPO వీర బుచ్చయ్య, హౌసింగ్ పీడీ రాజేశ్వర్ రావు, DWO వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు.
Similar News
News December 11, 2025
సాలూరు: బంతి పూల సాగు.. బహు బాగు

అయ్యప్ప, దుర్గమ్మ మాలదారులు పెరగడంతో పూలకు బాగా గిరాకీ పెరిగింది. దీన్ని ఆసరాగా తీసుకుని సాలూరులో కొంతమంది రైతులు తమకున్న కొద్దిపాటి భూమిలో పూలను సాగుచేస్తూ అధిక లాభాలు పొందుతున్నారు. సాలూరు, పెదబోరబంద, కూర్మరాజుపేట గ్రామాల్లో బంతిపూలు, కనకాంబరం సాగు చేస్తున్నారు. కేజీ బంతి పూలు రూ.100 వరకు ధర ఉందని కూరగాయల సాగు కంటే పూల సాగు వలన కొంత మేర లాభాలు పొందుతున్నామని రైతు శంకరరావు తెలిపారు.
News December 11, 2025
గద్వాలలో 86.77శాతం పోలింగ్ నమోదు

గద్వాల జిల్లాలోని నాలుగు మండలాల్లో మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలలో మొత్తం 86.77 శాతం పోలింగ్ నమోదైనట్లు జిల్లా కలెక్టర్ బి.ఎం.సంతోష్ తెలిపారు. నాలుగు మండలాల్లోని 14 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం కాగా మిగిలిన 92 గ్రామ పంచాయతీలలో ఉదయం 7:00 గంటలకు పోలింగ్ ప్రారంభమవగా ప్రతి రెండు గంటలకు ఓసారి పోలింగ్ శాతాన్ని పరిశీలించినట్లు చెప్పారు.
News December 11, 2025
పల్నాడు DEOగా రామారావు బాధ్యతలు

పల్నాడు జిల్లా విద్యాశాఖ అధికారి (DEO)గా పి.వి.జె. రామారావు గురువారం అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన కలెక్టర్ కృతికా శుక్లాను మర్యాదపూర్వకంగా కలిశారు. జిల్లా పాఠశాలల్లో విద్యా ప్రమాణాలను మెరుగుపరచడంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, విద్యార్థుల హాజరు, ఉపాధ్యాయుల లోటు, మౌలిక వసతులపై నిరంతర పర్యవేక్షణ అవసరమని కలెక్టర్ DEOకు సూచించారు.


