News March 16, 2025
పెద్దపల్లి: 30న అఖిల భారత యాదవ మహాసభ

ఈనెల 30వ తేదీన అఖిల భారత యాదవ మహాసభ నిర్వహించనున్నట్లు యాదవ సంఘం నాయకులు శనివారం వెల్లడించారు. ఈ మేరకు పెద్దపల్లి పట్టణంలో మీడియాతో మాట్లాడారు. మహాసభలో యాదవ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉగాది పురస్కారాలు ప్రదానం చేయనున్నట్లు తెలిపారు. పురస్కారాల కోసం ఆసక్తి ఉన్నవారు ఈనెల 23వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని, అలాగే మహాసభను విజయవంతం చేయాలని కోరారు.
Similar News
News February 12, 2026
బలిమెల నీటి వినియోగంపై ఆంధ్రా-ఒడిస్సా జెన్‌కో అధికారుల సమీక్ష

ఆంధ్ర, ఒడిశా ఉమ్మడి నిర్వహణలో ఉన్న బలిమెల జలాశయం నీటి వినియోగం, నిర్వహణపై ఇరు రాష్ట్రాల అధికారులు సీలేరు జెన్‌కో అతిథి గృహంలో సమీక్షించారు. జనవరి నెలలో బలిమెల జలాశయంలో నీటి వాడకంపై చర్చించారు. దీని ప్రకారం ఆంధ్ర ఇప్పటి వరకు తన వాటాగా 28.39 టీఎంసీల నీటిని, ఒడిశా 58.28 టీఎంసీల నీటిని వినియోగించుకుందని నిర్ధారించారు. మిగిలిన వినియోగంపై చర్చించారు.
News February 12, 2026
‘టీ’ని మళ్లీ వేడి చేస్తున్నారా.. ఇది మీ కోసమే!

చల్లారిన టీని మళ్లీ వేడి చేయడం ఆరోగ్యానికి హానికరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ‘రీహీట్ వల్ల చాయ్ చేదుగా, అసిడిటిక్‌గా మారుతుంది. కడుపులో తిప్పడం, అసిడిటీ, హార్ట్‌బర్న్, ఛాతీలో మంట ఏర్పడొచ్చు. అందులో చేరుకున్న బాక్టీరియా వల్ల కడుపు నొప్పి, వాంతులు, ఫుడ్ పాయిజన్ కావొచ్చు. తాజా టీతో పోలిస్తే యాంటీఆక్సిడెంట్లు తగ్గుతాయి. అందుకే ఫ్రెష్‌గా తాగండి. వాడిన పొడిని మళ్లీ వాడొద్దు’ అని చెబుతున్నారు.
News February 12, 2026
MBNR: అందరి చూపు అటువైపే..

మున్నిపల్ ఎన్నికల పోలింగ్ ముగియడంతో ఇక అందరి చూపు రేపటి ఓట్ల లెక్కింపుపైనే ఉంది. ఓట్లు బ్యాలెట్ బాక్సుల్లో నిక్షిప్తం కావడంతో గెలుపోటములపై అభ్యర్థుల్లో టెన్షన్ మొదలైంది. బయటకు తామే గెలుస్తామని చెప్పుకుంటున్నా.. సర్వేల్లో విభిన్న ఫలితాలు రావడం, పోలింగ్ తర్వాత అభ్యర్థులు డైలమాలో పడినట్లు తెలుస్తోంది. ఉమ్మడి జిల్లాలో చాలాచోట్ల ద్విముఖ, త్రిముఖ పోరు, బలమైన నాయకులు ఉండటంతో ఫలితాలపై ఉత్కంఠ నెలకొంది.


