News December 1, 2025

పెద్దపల్లి: 35 కంప్యూటర్ల సరఫరాకు దరఖాస్తుల ఆహ్వానం

image

పెద్దపల్లి జిల్లా ప్రభుత్వ పాఠశాలలకు 35 కంప్యూటర్ల సరఫరా కోసం ఆసక్తి గల సరఫరాదారులు డిసెంబర్ 4లోగా దరఖాస్తులు సమర్పించాలని ఇన్చార్జ్ డీఈఓ శారద తెలిపారు. దరఖాస్తులు జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయంలో స్వీకరించబడతాయి. వివరాలకు సెక్టోరల్ అధికారి సి.హెచ్. మల్లేష్ గౌడ్‌ (ఫోన్: 9959262737) ను సంప్రదించవచ్చు.

Similar News

News February 17, 2026

పాక్‌లో ‘Money Heist’.. 700 తులాల బంగారం చోరీ!

image

పాకిస్థాన్‌లోని కరాచీలో ‘మనీ హీస్ట్’ తరహా భారీ చోరీ జరిగింది. ఓ ఆభరణాల దుకాణంలో 300 మిలియన్ల PKR విలువైన బంగారాన్ని దుండగులు దోచుకున్నారు. షాపు వెనుక నుంచి రంధ్రం చేసి లోపలికి చొరబడ్డారని పోలీసులు తెలిపారు. 700 తులాల బంగారు కడ్డీలు, ఆభరణాలు ఎత్తుకెళ్లారని యజమాని ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నారు. దొంగలకు ఈ ప్రాంతంపై పట్టుందని, ఓ సెక్యూరిటీ గార్డును అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నట్లు చెప్పారు.

News February 17, 2026

కరీంనగర్‌లో రేపు జాబ్ మేళా

image

నిరుద్యోగ యువతీయువకులకు రేపు జిల్లా ఉపాధి కార్యాలయంలో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి అధికారి తిరుపతిరావు ఒక ప్రకటనలో తెలిపారు. కరీంనగర్లోని గోదావరిఖని బైపాస్ రోడ్డు కేబుల్ వంతెన సమీపంలోగల ఓ కంపెనీలో ఉద్యోగాలు అందుబాటులో ఉన్నాయన్నారు. టీమ్ లీడర్, సీనియర్ సేల్స్ ఎగ్జిక్యూటివ్, సేల్స్ ఆఫీసర్, ఫైనాన్స్ ఎగ్జిక్యూటివ్స్ సహా మొత్తం 20 పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు. వివరాలకు కాల్- 9908230384.

News February 17, 2026

సినీ నటి ప్రత్యూష మృతి కేసు.. నేడే తుది తీర్పు

image

2002లో <<18340301>>సంచలనం సృష్టించిన<<>> సినీ నటి ప్రత్యూష మృతి కేసులో నేడు సుప్రీంకోర్టు తుది తీర్పు ఇవ్వనుంది. హైకోర్టు విధించిన జైలుశిక్షను సవాలు చేస్తూ నిందితుడు సిద్ధార్థరెడ్డి వేసిన అప్పీల్, అతడికి శిక్ష పెంచాలంటూ ప్రత్యూష తల్లి సరోజిని వేసిన పిటిషన్లపై తీర్పును గతేడాది నవంబర్‌లో SC రిజర్వ్ చేసింది. ఈ క్రమంలో 24 ఏళ్ల నాటి కేసులో కోర్టు తీర్పు ఎలా ఉండబోతోందనేది ఆసక్తికరంగా మారింది.