News March 14, 2025

పెద్దాపురం: బ‌ల‌వంతపు పెళ్లిపై పోలీసుల‌కు బాలిక ఫిర్యాదు

image

పెద్దాపురంలో 9వ త‌ర‌గ‌తి చ‌దువుతున్న బాలిక (14)కు నిడ‌ద‌వోల‌కు చెందిన యువకుడి(28)తో బ‌ల‌వంతంగా పెళ్లి చేసేందుకు త‌ల్లిదండ్రులు సిద్ధ‌ప‌డ్డారు. రేపు(15న) నిశ్చితార్థం కూడా పెట్టేశారు. అయితే తాను పెళ్లి చేసుకోన‌ని, చ‌దువుకుంటాన‌ని బాలిక చెప్పింది. అధికారులు కౌన్సెలింగ్ ఇచ్చిన వారు వినలేదు. దీంతో బాలిక గురువారం పోలీసుల‌కు ఫిర్యాదు చేసింది. ఎస్ఐ వి.మౌనిక కేసు న‌మోదు చేసి, ద‌ర్యాప్తు చేస్తున్నామ‌న్నారు

Similar News

News February 18, 2026

OTD: టీమ్ఇండియా సంచలన విజయం

image

రెండేళ్ల క్రితం సరిగ్గా ఇదే రోజు రాజ్‌కోట్‌లో టీమ్‌ఇండియా చరిత్రాత్మక విజయాన్ని సాధించింది. ENGతో 3rd టెస్టులో 434 రన్స్ తేడాతో గెలిచింది. టెస్టుల్లో పరుగుల పరంగా భారత జట్టుకు ఇదే అతిపెద్ద విజయం. తొలి ఇన్నింగ్స్‌లో రోహిత్ శర్మ(131), జడేజా(112), రెండో ఇన్నింగ్స్‌లో జైస్వాల్ (214), గిల్ (91) రాణించారు. రెండు ఇన్నింగ్స్‌లలో కలిపి జడేజా 7, సిరాజ్ 4, బుమ్రా 2, అశ్విన్ 2, కుల్దీప్ 4 వికెట్లు తీశారు.

News February 18, 2026

రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ విడుదల

image

రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. ఫిబ్రవరి 26న నోటిఫికేషన్ వెలువడనుండగా మార్చి 16వ తేదీన పోలింగ్, అదే రోజు కౌంటింగ్ జరగనుంది. మొత్తం 10 రాష్ట్రాలకు సంబంధించి 37 మంది రాజ్యసభ సభ్యులను ఎన్నుకోనున్నారు. తెలంగాణ నుంచి 2 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఏప్రిల్ 9న BRS MP సురేశ్ రెడ్డి, కాంగ్రెస్ ఎంపీ అభిషేక్ సింఘ్వీ పదవీకాలం ముగియనుంది.

News February 18, 2026

‘అన్నా.. ప్లీజ్ వదిలేయ్ అన్నా’

image

అంటూ ఆ చిట్టితల్లి ఎంత ప్రాధేయపడి ఉంటుంది! ఆ మానవమృగ వికృతక్రీడలో ఎంత నరకం అనుభవించి ఉంటుంది? ఏపీలోని మదనపల్లెలో కులవర్ధన్ ఏడేళ్ల బాలికను అత్యాచారం చేసి, హత్య చేసిన <<19172410>>ఘటన<<>> తీవ్రంగా కలచివేస్తోంది. ఇంటి ముందే ఉండే అతడిని నిత్యం ఆప్యాయంగా ‘అన్నా.. అన్నా’ అని పిలిచినా ఆ దుర్మార్గుడు కనికరించలేదు. అత్యంత క్రూరంగా బాలికను నీటి డ్రమ్ములో కుక్కేశాడు. విధి ఆడిన వింత నాటకంలో అతడు కూడా నీటిలోనే శవమై తేలాడు.