News February 19, 2025
పెద్దాపురం: లలిత ఇండస్ట్రీస్‌లో జట్టు కార్మికుడు మృతి

పెద్దాపురంలో లలిత ఇండస్ట్రీస్‌లో జట్టు కార్మికుడు మంగళవారం స్నానం చేస్తూ బాత్ రూంలో మృతి చెందాడు. మృతుడు బిహార్ షబ్బీర్ ఆలం (34)గా గుర్తించారు. పచ్చకామర్లతో అనారోగ్యంగా ఉన్నాడని తోటి కార్మకులు తెలిపారు. మంగళవారం స్నానపు గదిలో ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. మృతదేహాన్ని పెద్దాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు అనుమానస్పద కేసుగా నమోదు చేసి విచారణ జరుపుతున్నామని తెలిపారు.
Similar News
News April 19, 2026
నిరుపయోగంగా గజ్వేల్ ఆర్టీసీ బస్టాండ్..!

గజ్వేల్ పట్టణంలోని తూప్రాన్ రోడ్డులో రూ.6 కోట్ల వ్యయంతో ఆరు ఎకరాల విస్తీర్ణంలో నిర్మించిన బస్టాండ్ నిరుపయోగంగా మారింది. గత ప్రభుత్వ హాయాంలో నిర్మించిన ఈ బస్టాండ్ గజ్వేల్ పట్టణానికి దాదాపుగా కిలోమీటరున్నర దూరంలో ఉండడంతో ప్రయాణికులు, ఆర్టీసీ బస్సులు అక్కడికి వెళ్లడం లేదు. దీంతో కోట్లాది రూపాయల ప్రజా సొమ్ము దుర్వినియోగం అవుతోంది. సదరు బస్టాండ్‌ను ఇతర అవసరాలకు వినియోగించాలని ప్రజలు కోరుతున్నారు.
News April 19, 2026
చిరు, బాలయ్యతో మోహన్‌లాల్ క్రేజీ రోల్స్?

చిరంజీవి, బాబీ కాంబో మూవీలో మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్ నటిస్తున్నారనే టాక్ ఎప్పటి నుంచో ఉంది. తాజాగా బాలయ్య-వివేక్ ఆత్రేయ ప్రాజెక్టులోనూ ఆయన పేరు వినిపిస్తోంది. ఒకేసారి ఇద్దరు బిగ్ స్టార్స్ సినిమాల్లో కనిపిస్తే ఫ్యాన్స్‌కు పండగే. అయితే డేట్స్ ఇష్యూ వల్ల చిరు సినిమా నుంచి ఆయన తప్పుకొనే ఛాన్స్ ఉందని టాక్. ఒకవేళ అంతా సెట్ అయితే 2027 సంక్రాంతికి మోహన్‌లాల్ డబుల్ ధమాకా ఇవ్వడం ఖాయంగా కనిపిస్తోంది.
News April 19, 2026
ట్రంప్-మునీర్ మైత్రి: అమెరికాకే ప్రమాదం!

ఇరాన్‌తో చర్చలకు మధ్యవర్తిగా పాక్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్‌ను ఎంచుకోవడాన్ని అమెరికా రక్షణ నిపుణులు తప్పుబడుతున్నారు. ఇరాన్ సైన్యం, నిఘా సంస్థలు, IRGC నేతలతో ఆయనకు ఏళ్ల నుంచి ఉన్న సంబంధాలే ఇందుకు కారణం. గతంలో అఫ్గాన్ విషయంలో మిత్రదేశంగా నటిస్తూనే తాలిబన్లకు సహకరించిన పాక్ ద్వంద్వ నీతిని మరువరాదని, మునీర్‌ను నమ్మడం వల్ల US వ్యూహాత్మక రహస్యాలు ఇరాన్ చేతికి చిక్కే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.


