News July 17, 2024

పెద్దిరెడ్డి ఫ్యామిలీ 3వేల ఎకరాలు కబ్జా చేసింది: మంత్రి

image

మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై రవాణ శాఖా మంత్రి రాంప్రసాద్ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘పెద్దిరెడ్డి, ఆయన కుమారుడు మిథున్ రెడ్డి 3 వేల ఎకరాలను కబ్జా చేశారు. పులిచెర్ల, అంగళ్లు, పుంగనూరు, తిరుపతిలో భూములు కాజేశారు. పోలీసులను అడ్డంపెట్టుకుని రూ.కోట్ల విలువైన ఎర్రచందనాన్ని చైనాకు తరలించారు. తమిళనాడు, కర్ణాటకకు ఇసుక తరలించి సొమ్ము చేసుకున్నారు’ అని మంత్రి ఆరోపించారు.

Similar News

News December 11, 2024

చిత్తూరు: ‘టిడ్కో గృహాలను మంజూరు చేయండి’

image

టిడ్కో గృహాలను వెంటనే లబ్ధిదారులకు మంజూరు చేయాలని ఏఐటీయూసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రమాదేవి డిమాండ్ చేశారు. 2018లో టీడీపీ ప్రభుత్వం మంజూరు చేసిన ఈ గృహాలను 2019-24 వరకు వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందన్నారు. ప్రస్తుతం టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినందున వెంటనే లబ్ధిదారులకు ఇళ్లను మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.

News December 10, 2024

ఈనెల 16 నుంచి జనవరి 14వ తేదీ వరకు ధనుర్మాసం

image

తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామి మాసోత్సవాల్లో అత్యంత ముఖ్యమైనదిగా భావించే ధనుర్మాసం డిసెంబ‌రు 16న ప్రారంభం కానుంది. ఉద‌యం 6.57 గంటలకు ధనుర్మాస ఘడియలు ప్రారంభం కానున్న నేపథ్యంలో 17వ తేదీ నుంచి స్వామివారికి నిర్వహించే సుప్రభాత సేవ స్థానంలో తిరుప్పావై నివేదిస్తారు. కాగా, జనవరి 14న ధనుర్మాస ఘడియలు ముగియనున్నాయి. ధ‌నుర్మాసం సంద‌ర్భంగా శ్రీ‌వారికి విశేష కైంక‌ర్యాలు నిర్వ‌హిస్తారు.

News December 10, 2024

21 నుంచి SVU పరీక్షల ప్రారంభం

image

తిరుపతి శ్రీవేంకటేశ్వర యూనివర్సిటీ పరిధిలో డిగ్రీ మొదటి సంవత్సరం మొదటి సెమిస్టర్ పరీక్షలు ఈనెల 21వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. జనవరి 2వ తేదీ వరకు కొనసాగుతాయని కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినర్ దామ్లా నాయక్ పేర్కొన్నారు. ఈ పరీక్షలు ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు నిర్వహిస్తామని చెప్పారు. విద్యార్థులు ఈ విషయాన్ని గమనించాలని సూచించారు.