News March 13, 2025

పెద్ద కార్పాముల: చికిత్స పొందుతూ వ్యక్తి మృతి

image

పెద్దకొత్తపల్లి మండల పరిధిలో మార్చి 2న జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తి చికిత్స పొందుతూ మృతిచెందారు. పోలీసుల వివరాలు.. పెద్దకొత్తపల్లి నుంచి పెద్దకార్పాములకు రాములు, స్వామిలు బైక్‌పై వెళ్తున్నారు. ఈ క్రమంలో ముందెళ్తున్న బైక్‌ని ఢీకొని కిందపడగా.. ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. ఇద్దరినీ HYDలోని ఆసుపత్రికి తీసుకెళ్లగా బుధవారం రాములు చనిపోయారు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ సతీశ్ తెలిపారు.

Similar News

News February 17, 2026

KNR మేయర్ శ్రీనివాస్ రాజకీయ ప్రస్థానమిదే..!

image

<<19162897>>శ్రీనివాస్ <<>>2014- 19 వరకు BJP మండల ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. 2020-25 వరకు KNR మున్సిపల్ కార్పొరేషన్ 1వ డివిజన్ కార్పొరేటర్‌గా కొనసాగారు. 2021లో కరోనా వ్యాక్సిన్ జిల్లా కన్వీనర్‌గా, 2023-24 వరకు KNR టౌన్ 1 కన్వీనర్‌గా, 2024లో NIFFA రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా, 2025లో చొప్పదండి మండల సర్పంచ్ ఎన్నికల ఇన్‌ఛార్జ్‌గా పనిచేశారు. తాజాగా KNR మున్సిపల్ కార్పొరేషన్ 2వ డివిజన్ కార్పొరేటర్‌గా ఎన్నికయ్యారు.

News February 17, 2026

‘జై హనుమాన్’లో కదలిక.. షూటింగ్‌కి రెడీ!

image

కన్నడ నటుడు రిషబ్ శెట్టి, డైరెక్టర్ ప్రశాంత్ వర్మ కాంబోలో ‘జై హనుమాన్’ను 2024 అక్టోబర్‌లో <<14492400>>ప్రకటించిన<<>> విషయం తెలిసిందే. ఈ నెల 22న మూవీ పూజా కార్యక్రమం నిర్వహించనున్నట్లు సినీ వర్గాలు తెలిపాయి. కర్ణాటకలోని హంపికి దగ్గర్లో హనుమాన్‌హల్లిలోని అంజనాద్రి హిల్‌లో ఈ కార్యక్రమం జరుగుతుందని చెప్పాయి. 2024లో రిలీజైన హనుమాన్‌కు సీక్వెల్‌గా జై హనుమాన్ తెరకెక్కనుంది. ఆంజనేయుడిగా రిషబ్ కనిపించనున్నారు.

News February 17, 2026

ఈ రోజు నమాజ్ వేళలు (ఫిబ్రవరి 17, మంగళవారం)

image

♦︎ ఫజర్: తెల్లవారుజామున 5.29 గంటలకు
♦︎ సూర్యోదయం: ఉదయం 6.42 గంటలకు
♦︎ దుహర్: మధ్యాహ్నం 12.30 గంటలకు
♦︎ అసర్: సాయంత్రం 4.42 గంటలకు
♦︎ మఘ్రిబ్: సాయంత్రం 6.19 గంటలకు
♦︎ ఇష: రాత్రి 7.32 గంటలకు
➤ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.