News January 25, 2025
పెనమలూరు: బ్యాంక్ ఉద్యోగికి భారీ మోసం

బ్యాంక్‌లో అపార అనుభవం ఉన్న ఓ విశ్రాంత బ్యాంక్ అధికారికి సైబర్ నేరగాళ్లు కళ్లెం వేశారు. పెనమలూరు పోలీసుల వివరాల మేరకు.. తాడిగడపకు చెందిన ఉమామహేశ్వర గుప్తా అనుమతులు లేకుండానే కొందరు వాట్సాప్ గ్రూప్‌లో యాడ్ చేశారు. షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెడితే లాభాలు వస్తాయని చెప్పడంతో ఆయన నమ్మి 9సార్లు రూ.78.33 లక్షలు పంపించారు. తిరిగి అడుగగా వారు స్పందించకపోవడంతో మోసపోయినట్లు గుర్తించారు.
Similar News
News February 11, 2025
పొరపాట్లకు తావు లేకుండా MLC ఎన్నికలు: కలెక్టర్

ఎటువంటి పొరపాట్లకు తావు లేకుండా అధికారులు సమన్వయంతో ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల శాసనమండలి పట్టభద్రుల నియోజవర్గ ఎన్నికను విజయవంతం చేయాలని కృష్ణాజిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డీకే బాలాజీ అన్నారు. ఈనెల 27న జిల్లాలో నిర్వహించే పోలింగ్ నిర్వహించనున్న నేపథ్యంలో సోమవారం జిల్లా ఎస్పీతో కలిసి నోడల్ అధికారులతో ఆయన ప్రత్యేక సమావేశం నిర్వహించారు.
News February 11, 2025
కృష్ణా: MLC స్థానానికి ఎన్ని నామినేషన్లు వచ్చాయంటే.!

ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల MLC ఎన్నికల నిమిత్తం నామినేషన్ గడువు ముగిసేనాటికి 40 మంది అభ్యర్థులు నామినేషన్లు సమర్పించారు. కాగా ఈ రోజుతో నామినేషన్ సమర్పించే గడువు ముగియగా ఈ ఒక్క రోజే 22 మంది నామినేషన్లు వేసినట్లు తాజాగా సమాచారం వెలువడింది. ఈ ఎన్నికలలో NDA కూటమి అభ్యర్థిగా ఆలపాటి రాజేంద్ర, PDF అభ్యర్థిగా లక్ష్మణరావు బరిలో నిలువగా, వైసీపీ పోటీ నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే.
News February 10, 2025
బాలల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ పాటుపడాలి: కలెక్టర్

పిల్లల రక్షణ, సంరక్షణ ప్రతి ఒక్కరిపై ఉందని కృష్ణాజిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అన్నారు. కలెక్టరేట్‌లోని తన ఛాంబర్‌లో సోమవారం కలెక్టర్ డీకే బాలాజీ, సీనియర్ సివిల్ జడ్జి కేవీ రామకృష్ణయ్య అధ్యక్షతన డిస్ట్రిక్ట్ చైల్డ్ వెల్ఫేర్ ప్రొటెక్షన్ కమిటీ తొలి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ.. బాలల రక్షణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ పాటుపడాలన్నారు.