News July 18, 2024
పెనుకొండ మండలంలో హత్య.. కారణం ఏంటంటే
పెనుకొండ మండలంలో హత్య జరిగిన విషయం తెలిసిందే. పోలీసుల వివరాలు.. నిందుతుడు గంగాధర్‌కు మతిస్థిమితం లేదు. తనను చంపేందుకు తండ్రి మనుషులను పంపుతున్నాడని గతంలో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. హిందూపురానికి చెందిన చిరువ్యాపారి చిన్నఅంజినప్ప గుట్టూరులోని కొల్హాపురి ఆలయంలో నిద్రపోయాడు. అర్ధరాత్రి గంగాధర్ ఆలయానికి వచ్చి తన తండ్రి తనను చంపేందుకే అంజినప్పను పంపాడని గొడవపడి తువాలుతో గొంతు బిగించి హత్య చేశాడు.
Similar News
News December 13, 2024
అప్పటి నుంచి ఏటా ఉరుసు ఉత్సవాలు (1/2)
అలా <<14864840>>బాబా<<>> ఫకృద్దీన్ పెనుకొండ శివారులోని ఓ మంటపంలోకి చేరుకుంటారు. ప్రజలకు ప్రేమను పంచుతూ మతసామరస్యాన్ని వివరించేవారు. బాబయ్య స్వామిగా పేరొంది ప్రజలను ఆశీర్వదించేవారు. అయితే గురువు ఇచ్చిన వేపపుల్లను రోజూ తలకింద పెట్టుకుని నిద్రపోయేవారట. ఒక రోజు ఆ వేపపుల్ల చిగురించడంతో ఇదే తన నివాసమని భావిస్తారు. క్రీస్తుశకం 694లో పరమదించడంతో అక్కడే సమాధి చేశారు. అప్పటి నుంచి ఏటా ఉరుసు ఉత్సవాలను నిర్వహిస్తున్నారు.
News December 13, 2024
కుటుంబ కలహాలతో ఆ ఇంట పెను విషాదం
కుటుంబ కలహాలు తల్లీ, కొడుకు ప్రాణాలు తీశాయి. కూతురి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటన గార్లదిన్నె మండలంలో జరిగింది. ఎర్రగుంట్లకు చెందిన సురేశ్, సుజాత(38) దంపతుల మధ్య కొన్ని రోజులుగా గొడవలున్నాయి. అవి తారాస్థాయికి చేరుకోవడంతో నిన్న ఉదయం ఆమె విష గుళికలు తీసుకున్నారు. నిద్రపోతున్న తన కుమారుడు చైతన్య, కుమార్తె రహిత్యకు వాటిని తినిపించారు. ఈ ఘటనలో తల్లీ, కుమారుడు మరణించారు. రహిత్య పరిస్థితి విషమంగా ఉంది.
News December 13, 2024
JNTUAలో 150 మంది విద్యార్థులకు ఉద్యోగాలు
అనంతపురం JNTU ఇంజినీరింగ్ కళాశాలలో 2025 గ్రాడ్యుయేటింగ్ బ్యాచ్‌కు చెందిన 150 మంది విద్యార్థులు కళాశాల ప్రాంగణ నియామకాలలో ఉద్యోగాలు సాధించినట్లు ఇన్‌ఛార్జ్ వీసీ సుదర్శన రావు పేర్కొన్నారు. ఇందులో 121 మంది TCSలో, 11 మంది L&Tలో, 9 మంది CTSలో, 6 మంది FACTSETలో, 3 మంది MOSCHIPలో ఎంపికయ్యారని తెలిపారు. ఎంపికైన విద్యార్థులను ఇన్‌ఛార్జ్ వీసీ సుదర్శన రావు, కళాశాల ప్రిన్సిపల్ చెన్నారెడ్డి అభినందించారు.