News December 2, 2025
పెనుగంచిప్రోలు: అమ్మవారి దర్శనం ఇక ఆన్‌లైన్‌లో

పెనుగంచిప్రోలు అమ్మవారి దర్శనం, సేవలను ఇకపై ఆన్‌లైన్‌లో పొందవచ్చని ఈవో కిషోర్ కుమార్ తెలిపారు. దర్శనం టిక్కెట్లు, ప్రసాదం టిక్కెట్లతో పాటు ఇతర సేవలను https://www.aptemples.org వెబ్‌సైట్ లేదా 9552300009 వాట్సాప్ ద్వారా బుక్ చేసుకునేలా ఏర్పాట్లు చేశారు. అన్నదానం, గోసంరక్షణ వంటి పథకాలకు క్రెడిట్/డెబిట్ కార్డులు, యూపీఐ (Google Pay, Phone Pe, Paytm, BHIM) ద్వారా కూడా విరాళాలు చెల్లించవచ్చని తెలిపారు.
Similar News
News February 17, 2026
రాష్ట్రంలో వాలంటీర్ల నియామకం.. ఫొటోకు రూ.7-10

TG: పంటల నమోదు సర్వే కోసం ప్రతి గ్రామానికి ఒక వాలంటీర్ చొప్పున 10,909 మందిని నియమించాలని వ్యవసాయశాఖ నిర్ణయించింది. టెన్త్ నుంచి డిగ్రీ వరకు చదివి గ్రామ భూములపై అవగాహన ఉన్న వారికి ప్రాధాన్యం ఉంటుంది. ఒక్కో ఫొటోకు రూ.7 నుంచి రూ.10 వరకు చెల్లిస్తారు. 45 రోజుల యాసంగి సీజన్‌లో 2000 ఫోటోల వరకు అప్‌లోడ్ చేయవచ్చు. విద్యార్హత పత్రాలతో మండల వ్యవసాయ అధికారుల దగ్గర దరఖాస్తు చేసుకోవాలి.
News February 17, 2026
ఫ్యామిలీతో ఇండియాకు రండి.. తారిఖ్‌కు మోదీ ఆహ్వానం

బంగ్లాదేశ్ PM తారిఖ్ రెహ్మాన్‌కు భారత ప్రధాని మోదీ అభినందనలు తెలిపారు. పదవీకాలంలో విజయం సాధించాలని ఆకాంక్షించారు. భార్య జుబైదా, కుమార్తె జైమాతో కలిసి INDలో పర్యటించాలని ఆహ్వానించారు. ద్వైపాక్షిక సంబంధాల బలోపేతం కోసం ఎదురుచూస్తున్నట్లు తెలిపారు. కనెక్టివిటీ, ట్రేడ్, టెక్నాలజీ, ఎడ్యుకేషన్, స్కిల్ డెవలప్‌మెంట్, ఎనర్జీ, హెల్త్ కేర్ రంగాల్లో కలిసి పనిచేద్దామని పిలుపునిచ్చారు.
News February 17, 2026
భూపాలపల్లి: ఫిబ్రవరి 21 నుంచి పత్తి కొనుగోళ్లు నిలిపివేత

భారత పత్తి సంస్థ మద్దతు ధర పత్తి కొనుగోళ్లు 21.02.2026 నుంచి రాష్ట్రవ్యాప్తంగా నిలిపివేయనున్నట్లు వ్యవసాయ మార్కెటింగ్ శాఖ తెలిపింది. భూపాలపల్లి జిల్లాలో ఇప్పటికీ పత్తి అమ్మని రైతులు 20.02.2026 లోగా సమీప కొనుగోలు కేంద్రంలో కాపాస్ కిసాన్ యాప్‌లో స్లాట్ బుక్ చేసుకుని విక్రయించాలని జిల్లా మార్కెటింగ్ అధికారి ప్రవీణ్ రెడ్డి సూచించారు. రైతులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు.


