News September 12, 2024
పెనుగొండ: పెద్ద మనసు చాటుకున్న చిన్నారి
పెనుగొండలో ఓ చిన్నారి పెద్ద మనసు చాటుకుంది. విజయవాడ వరద బాధితులకు తన వంతు సాయంగా షాపుల వెంట తిరుగుతూ రూ.3,700 సేకరించింది. తన చిట్టి మాటలతో బాధితులకు ఆహారం, దుస్తులు ఇవ్వాలని కోరింది. చిన్నారిని చూసి ప్రతి ఒక్కరూ వరద బాధితుల సహాయార్థం ముందుకు రావాలని ప్రిన్సిపల్ వెంకట అప్పారావు తెలిపారు. చిన్నారి మాటలు ప్రతి ఒక్కరి మనసు కదిలించాయి.
Similar News
News October 13, 2024
అధికారులంతా అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్
అక్టోబర్ 14 నుంచి 16 వరకు భారీ వర్షాలు కురిసే నేపథ్యంలో అధికారులు అందరూ అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ చదలవాడ నాగరాణి ఓ ప్రకటన ద్వారా తెలిపారు. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనున్న నేపథ్యంలో 14 నుంచి 15 వరకు తేలిక పాటు వర్షాలు కురుస్తాయని, 16 నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. అధికారులంతా అప్రమత్తంగా ఉండాలని అన్నారు.
News October 12, 2024
ద్వారకా తిరుమల వెంకన్నకు బ్రహ్మోత్సవాలు
ద్వారకాతిరుమల అఖిలాండ కోటి బ్రహ్మాండనాయుడి వైభవాన్ని చాటే శ్రీవారి బ్రహ్మోత్సవాలు ఈ నెల 13 నుంచి ప్రారంభం కానున్నాయి. చిన్నతిరుపతిగా పేరొందిన ద్వారకాతిరుమల దివ్య క్షేత్రంలో స్వామివారికి ఏటా రెండు పర్యాయాలు(వైశాఖ, ఆశ్వీయుజ మాసాల్లో)ఈ బ్రహ్మోత్సవాలు వైఖానస ఆగమోక్తంగా జరపడం సంప్రదాయంగా వస్తోంది. ఈనెల 13 నుంచి 20 వరకు ఈ ఉత్సవాలను నిర్వహిస్తామని ఆలయ అధికారులు తెలిపారు.
News October 12, 2024
మన ఏలూరు జిల్లాకు రెండో స్థానం
ఏలూరు జిల్లాలో మద్యం షాపులకు దరఖాస్తుల గడువు శుక్రవారంతో ముగిసింది. మద్యం షాపులకు దరఖాస్తులు వెల్లువెత్తడంతో రాష్ట్రంలోనే ఏలూరు జిల్లా రెండో స్థానంలో నిలిచింది. మొత్తం5,339 దరఖాస్తులు అందినట్లు ఎక్సైజ్ శాఖ తెలిపింది.ఈ నెల 14న లాటరీ పద్ధతిలో షాపులను కేటాయించనున్నారు. దీంతో దరఖాస్తు దారులంతా టెన్షన్ తో ఎదురుచూస్తున్నారు.