News August 14, 2025

పెన్‌గంగా నదిలో గుర్తుతెలియని మహిళ మృతదేహం

image

ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలంలోని పెన్ గంగా నదిలో ఓ గుర్తు తెలియని మహిళ మృతదేహం లభ్యమైంది. మండలంలోని కౌఠ గ్రామ శివారులోని పెన్ గంగా నదిలో గురువారం గుర్తుతెలియని మహిళ మృతదేహాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. మృతురాలి వయసు సుమారు 45 నుంచి 50 సంవత్సరాలు ఉంటుందని పోలీసులు తెలిపారు. దుస్తులు చూసి, ఆమెని ఎవరైనా గుర్తిస్తే జైనథ్ పోలీస్ స్టేషన్‌లో సమాచారం అందించాలన్నారు.

Similar News

News March 6, 2026

గిన్నిస్ రికార్డ్.. ఈయనకు 42 పళ్లు

image

సాధారణంగా మనిషికి 32 పళ్లు ఉంటాయని చదువుకున్నాం. కొందరికి 34 కూడా ఉండటం చూస్తుంటాం. కానీ మలేషియాకు చెందిన 33 ఏళ్ల ప్రతాప్ మునియాండికి ఏకంగా 42 పళ్లు ఉన్నాయి. ఈయనను అత్యధిక పళ్లున్న వ్యక్తిగా గుర్తించినట్లు గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ట్వీట్ చేసింది. ఆయన ఫొటోను షేర్ చేయగా నోరంతా దంతాలే కనిపించాయి. 2021లో తన కుటుంబంతో కలిసి ఉన్నప్పుడు ఈ విషయాన్ని గమనించిన ఆయన డెంటిస్టుల ద్వారా నిర్ధారించుకున్నారు.

News March 6, 2026

పార్వతీపురం: ‘15 లోగా CSC పనులను పూర్తి చేయాలి’

image

జిల్లాలోని కమ్యూనిటీ శానిటరీ కాంప్లెక్స్ (CSC) పనులను కాలపరిమితిలోగా పూర్తి చేయాలని కలెక్టర్ డా.ఎన్.ప్రభాకర రెడ్డి అధికారులను ఆదేశించారు. శుక్రవారం పార్వతీపురం కలెక్టరేట్లో అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లాలో మంజూరైన ప్రతి CSC పని పూర్తి కావడమే లక్ష్యంగా అధికారులు పనిచేయాలని ఆయన స్పష్టం చేశారు.

News March 6, 2026

నిర్మల్: పరీక్షలకు 143 మంది గైర్హాజరు

image

జిల్లాలో శుక్రవారం నిర్వహించిన ఇంటర్ ద్వితీయ సంవత్సరం గణితం-2, జంతుశాస్త్రం-2, చరిత్ర-2 పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయని డీఐఈఓ పరశురాం తెలిపారు. మొత్తం 5677 మంది విద్యార్థులకు గాను 5534 మంది హాజరు కాగా, 143 మంది గైర్హాజరయ్యారు. దిలావర్‌పూర్, కుంటల, నిర్మల్ బాలుర జూనియర్ కళాశాలల్లోని పరీక్షా కేంద్రాలను ఆయన స్వయంగా తనిఖీ చేశారు. ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగలేదని ఆయన పేర్కొన్నారు.