News August 14, 2025

పెబ్బేరు: బైక్ నుంచి రూ.2.20 లక్షలు చోరీ: SI

image

పార్కింగ్ చేసిన బైక్ టూల్ బాక్స్ నుంచి రూ.2.20లక్షలు చోరీ చేసిన ఘటన బుధవారం పెబ్బేరులో జరిగింది. శ్రీరంగాపూర్‌కు చెందిన ఆంజనేయులు పెబ్బేరు SBIలో డబ్బులు డ్రా చేసి బైక్ టూల్ బాక్స్‌లో ఉంచారు. బీజేపీ క్యాంపులో బైక పార్క్ చేసి అధికారిని కలిసి తిరిగి వచ్చేవరకు నగదును గుర్తుతెలియని వ్యక్తులు చోరీ చేశారు. బాధితుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై యుగంధర్ రెడ్డి తెలిపారు.

Similar News

News March 7, 2026

గుంటూరు: రేపు గురుకులాల్లో ఖాళీ సీట్లకు ప్రవేశ పరీక్ష

image

సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల్లో ఖాళీగా ఉన్న సీట్ల భర్తీ కోసం ఆదివారం ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. జిల్లా కోఆర్డినేటర్ శ్రీదేవి ఈ విషయాన్ని వెల్లడించారు. 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఈ పరీక్ష ఉంటుంది. ఉదయం 10 గంటల నుంచి 11.30 వరకు 6, 7 తరగతుల అభ్యర్థులకు పరీక్ష నిర్వహిస్తారు. మధ్యాహ్నం 2 నుంచి 3.30 వరకు 8, 9, 10 తరగతుల విద్యార్థులకు పరీక్ష జరుగుతుందని తెలిపారు.

News March 7, 2026

మెదడును చురుగ్గా పనిచేయించే ‘కోకో’

image

కోకో తీసుకోవడం వల్ల మెదడు పనితీరు మెరుగుపడుతుందని జపాన్ శాస్త్రవేత్తలు గుర్తించారు. దీనిలోని ఫ్లావనాల్స్ రక్త ప్రసరణను మెరుగుపరిచి, మెదడుకు ఆక్సిజన్‌ను అందిస్తాయి. ఫలితంగా ఏకాగ్రత పెరగడం, వేగంగా నిర్ణయాలు తీసుకోవడం, మానసిక అలసట తగ్గుతుందని పేర్కొన్నారు. రోజుకు 3 చెంచాల కోకో పౌడర్‌ను పాలు/ నీటిలో కలుపుకుని తాగితే మెదడు మరింత చురుగ్గా మారుతుందని సూచిస్తున్నారు. డార్క్ చాక్లెట్‌లోనూ కోకో ఉంటుంది.

News March 7, 2026

చిత్తూరు జిల్లాలో 250 మంది ట్రాన్స్‌ఫర్

image

చిత్తూరు పోలీసు శాఖలో 250 మంది సిబ్బందిని బదిలీ చేస్తూ ఎస్పీ తుషార్ డూడీ ఉత్తర్వులు జారీచేశారు. చిత్తూరులోని జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ సమక్షంలో బదిలీ కౌన్సెలింగ్ శుక్రవారం చేపట్టారు. ఇందులో 125 మంది కానిస్టేబుళ్లు, 60 మందికి పైగా హెడ్ కానిస్టేబుళ్లు, 50 మంది వరకు ఏఎస్ఐలు ఉన్నారు. ఒకే స్టేషన్లో మూడేళ్లుగా పనిచేస్తున్న వాళ్ల నుంచి ఐదేళ్ల పాటు పనిచేస్తున్న సిబ్బందికి కౌన్సెలింగ్ నిర్వహించారు.