News December 2, 2025
పెళ్లికి వచ్చిన వారికి హెల్మెట్లు

రాజస్థాన్‌లో జరిగిన ఓ పెళ్లి వేడుకలో ఇచ్చిన రిటర్న్ గిఫ్టులు SMలో వైరల్ అయ్యాయి. అక్కడి కుచామన్ నగరంలో మనోజ్ బర్వాల్ అనే వ్యక్తి తన కూతురు సోనును యశ్ బెద్వాల్ అనే వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేశారు. వివాహానికి హాజరైన వారికి రిటర్న్ గిఫ్టులుగా హెల్మెట్లు ఇవ్వడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. రోడ్డు భద్రతా నియమాలపై అవగాహన కల్పిస్తూ 286 హెల్మెట్లను అందజేయడం పట్ల SMలో అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.
Similar News
News February 13, 2026
రిలయన్స్‌కు వెనిజులా ఆయిల్.. లైసెన్స్ ఇచ్చిన అమెరికా!

వెనిజులా నుంచి డైరెక్ట్ ఆయిల్ కొనేందుకు రిలయన్స్‌కు US లైసెన్స్ ఇచ్చినట్లు సమాచారం. దీంతో ఆంక్షల భయం లేకుండా ఆ కంపెనీ ఇకపై అక్కడి నుంచి నేరుగా క్రూడాయిల్ ఇంపోర్ట్ చేసుకోవచ్చు. ప్రపంచంలోనే అతిపెద్ద రిఫైనరీ ఉన్న రిలయన్స్‌కు దీనివల్ల ఖర్చులు తగ్గుతాయి. వెనిజులా మాజీ అధ్యక్షుడు మదురో అరెస్ట్ తర్వాత అక్కడి ఆయిల్ ఇండస్ట్రీని US శాసిస్తోంది. మరోవైపు ఈ పరిణామంతో రష్యా నుంచి చమురు దిగుమతులు తగ్గనున్నాయి.
News February 13, 2026
మున్సిపోల్స్.. 3 కార్పొరేషన్లలో హంగ్?

TG: కార్పొరేషన్ల ఫలితాలు ఆసక్తిగా మారాయి. కొత్తగూడెం, నిజామాబాద్, కరీంనగర్ కార్పొరేషన్లలో హంగ్ ఏర్పడినట్లు తెలుస్తోంది. కొత్తగూడెంలోని 60 స్థానాల్లో చెరో 22 చోట్ల కాంగ్రెస్, CPI గెలవగా 8 చోట్ల BRS గెలిచింది. ఇప్పటికే CPIకి సపోర్ట్ చేస్తామని కేటీఆర్ ప్రకటించిన నేపథ్యంలో CPIకి మేయర్ పీఠం దక్కే ఛాన్స్ ఉంది. అటు కరీంనగర్, నిజామాబాద్‌లో మేయర్ పీఠం కోసం BRS లేదా స్వతంత్రులపై BJP ఆధారపడటం తప్పేలా లేదు.
News February 13, 2026
ఇండియా-పాకిస్థాన్ మ్యాచ్‌కు వర్షం ముప్పు?

ఎన్నో ట్విస్టులు, మరెన్నో వివాదాల తర్వాత ఎల్లుండి ఇండియా-పాక్ మ్యాచ్ జరగనున్న విషయం తెలిసిందే. అయితే మ్యాచ్ వేదిక కొలంబోకు వర్షం ముప్పు పొంచి ఉంది. సాయంత్రం అక్కడ ఉరుములతో కూడిన వర్షం పడే అవకాశం 50-65% ఉందని Accuweather అంచనా వేసింది. కొలంబోలో కొన్ని రోజులుగా వాన పడుతోందని సమాచారం. ఈనెల 15 నాటికి ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని శ్రీలంక IMD చెప్పడం గమనార్హం.


