News February 10, 2025
పెళ్లి పేరుతో మోసం.. కర్నూలులో మహిళపై కేసు

పెళ్లి పేరుతో భారీగా డబ్బు తీసుకుని కర్నూలు వ్యక్తిని ఓ మహిళ మోసం చేసింది. పోలీసుల వివరాల మేరకు.. గద్వాల జిల్లా చింతకుంటకు చెందిన అబ్దుబ్ బి అనే మహిళ పెళ్లి పేరుతో రూ.17 లక్షలు తీసుకుని మోసం చేసిందని కల్లూరు ముజఫర్ నగర్‌కు చెందిన షేక్ కబీర్ బాషా కోర్టును ఆశ్రయించారు. కేసు నమోదుకు కోర్టు ఆదేశాలు ఇచ్చింది. దీంతో నిందితురాలిపై కర్నూలు నాలుగో పట్టణ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది.
Similar News
News February 16, 2026
పత్తిలో కలుపు సమస్య- నివారణకు సూచనలు

☛ పత్తి మొలకెత్తిన నెల రోజులకు కలుపు కనిపిస్తే క్విజలాఫాప్ ఇథైల్ 400ML లేదా ప్రోఫాక్విజఫాప్ 250ML, పైరిథయోబాక్ సోడియం 250ML 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయాలి. ☛ ప్రతి పది రోజులకొకసారి గొర్రు, గుంటకలతో అంతరకృషి చేయాలి. కలుపును ఏరివేయాలి. ☛ వర్షాలు ఎక్కువగా ఉండి కలుపు తీయడం కుదరకపోతే పారాక్వాట్ 5ML+ 10గ్రా. యూరియాతో లీటరు నీటికి కలిపి పత్తి మొక్కలపై పడకుండా వరుసల మధ్య మాత్రమే పిచికారీ చేయాలి.
News February 16, 2026
సిరిసిల్ల: కౌన్సిలర్లతో ప్రమాణ స్వీకారం చేయిస్తున్న ఆర్డీవో

మున్సిపల్ ఎన్నికల్లో గెలుపొందిన కౌన్సిలర్‌లతో ఆర్డీవో వెంకటేశ్వర్లు ఒక్కొక్కరిగా ప్రమాణ స్వీకారం చేయిస్తున్నారు. కాసేపట్లో ఛైర్మన్, వైస్ ఛైర్మన్ ఎన్నిక ఉండగా, బీఆర్ఎస్ పార్టీకి చెందిన 27 మంది కౌన్సిలర్లు, బీజేపీకి చెందిన 5 గురు కౌన్సిలర్లు మాత్రమే హాజరయ్యారు. కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లతో పాటు ఒక ఇండిపెండెంట్ కౌన్సిలర్ సమావేశానికి హాజరు కాలేదు.
News February 16, 2026
జేఈఈ మెయిన్ ఫైనల్ కీ రిలీజ్

జేఈఈ మెయిన్ ఫలితాల కోసం దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు, పేరెంట్స్ ఎదురు చూస్తున్నారు. ఈ టైమ్‌లో NTA ఫైనల్ కీ రిలీజ్ చేసింది. షెడ్యూల్ ప్రకారం ఈ నెల 12న ఫలితాలు రిలీజ్ కావాల్సి ఉండగా ఇవాళ వెల్లడిస్తామని 4రోజుల కిందట అప్డేట్ ఇచ్చింది. తాజాగా కీ విడుదల కాగా ఏ క్షణంలోనైనా ఫలితాలు వెల్లడయ్యే ఛాన్సుంది.


