News March 20, 2024

పెళ్లి పేరుతో మోసం.. కానిస్టేబుల్‌కు జైలు శిక్ష

image

ఓ RPF కానిస్టేబుల్ పెళ్లి పేరుతో మోసం చేశాడు. అమలాపురం రూరల్ మండలం వన్నె చింతలపూడికి చెందిన పరమట వెంకటేశ్వర దొరబాబు పేరూరుకు చెందిన ఓ యువతిని ప్రేమించాడు. ఆ తర్వాత ఆమెను పట్టించుకోకపోవడంతో బాధితురాలు 2009 జనవరిలో పోలీసులకు ఫిర్యాదు చేసింది. నేరం రుజువు కావడంతో అతడికి ఏడేళ్ల జైలు శిక్ష, రూ.5 వేలు జరిమానా విధిస్తూ రాజమండ్రి కోర్టు జడ్జి వై.బెన్నయ్య నాయుడు మంగళవారం తీర్పు చెప్పారు.

Similar News

News December 17, 2025

తూ.గో: సంక్రాంతి కి స్పెషల్ ట్రైన్స్ వచ్చేస్తున్నాయ్..

image

సంక్రాంతి పండుగ సందర్భంగా జిల్లా మీదుగా పలు స్పెషల్ ట్రైన్స్ నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. సికింద్రాబాద్ – శ్రీకాకుళం రోడ్డు మధ్య 07288/ 07289 నంబర్ రైళ్లు జనవరి 9,10,11,12 తేదీలలో రాకపోకలు ఉంటాయి. 07290/07291 నంబర్ రైళ్లు సికింద్రాబాద్ -శ్రీకాకుళం రోడ్డు మధ్య 10, 11, 12, 13, 16, 17, 18, 19 తేదీల్లోనూ, శ్రీకాకుళం రోడ్డు సికింద్రాబాద్‌కు 07295 రైలు జనవరి 14న ట్రైన్స్ నడవనున్నాయి.

News December 17, 2025

తూ.గో: ‘జిల్లాలో ధాన్యం సేకరణ విజయవంతం’

image

తూర్పు గోదావరి జిల్లాలో ఖరీఫ్ 2025–26 సీజన్‌లో ధాన్యం సేకరణ విజయవంతంగా కొనసాగుతోందని జేసీ వై. మేఘ స్వరూప్ మంగళవారం తెలిపారు. రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ ద్వారా డిసెంబర్ 16, 2025 నాటికి జిల్లాలో 42,977 మంది రైతుల నుంచి రూ. 770.74 కోట్ల విలువ చేసే 3,25,345 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించామన్నారు. ఇప్పటివరకు 37,308 మంది రైతులకు రూ. 659.76 కోట్లను చెల్లించినట్లు ఆయన వివరించారు.