News April 14, 2025
పెళ్లి పేరుతో మోసం.. యువకుడిపై కేసు

ప్రేమ పేరుతో మోసం చేసిన యువకుడిపై పోక్సో కేసు నమోదైంది. ఈ ఘటన తిరుపతి జిల్లా బాలాయపల్లె మండలంలో వెలుగు చూసింది. భైరవరం పంచాయతీకి చెందిన పోలయ్య ఓ యువతి(19)ని మూడేళ్లుగా ప్రేమిస్తూ పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. ఇటీవలే ఆమె ఐదు నెలల గర్భిణి అని తేలింది. దీంతో పెళ్లి చేసుకోవాలని పోలయ్యను కోరగా.. అతడు నిరాకరించాడు. బాధితురాలి ఫిర్యాదుతో పోలయ్యపై కేసు నమోదు చేశారు.
Similar News
News January 13, 2026
147పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

సొసైటీ ఫర్ అప్లైడ్ మైక్రోవేవ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ &రీసెర్చ్ (SAMEER) 147 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. పోస్టును బట్టి సంబంధిత విభాగంలో BE/BTech, ME/MTech, MSc, BSc, డిప్లొమా, ITI ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం గల వారు JAN 25వరకు అప్లై చేసుకోవచ్చు. రాతపరీక్ష/ఇంటర్వ్యూ/స్కిల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. రాత పరీక్ష FEB 1న నిర్వహించనున్నారు. వెబ్‌సైట్: https://sameer.gov.in/
News January 13, 2026
తిరుపతి: 2నెలల జీతాలు విడుదల

ప్రభుత్వ గురుకుల స్కూల్లో ఉద్యోగంలో చేరిన 2025 డీఎస్సీ ఉపాధ్యాయులకు 2నెలల జీతాలు విడుదలయ్యాయి. ప్రాన్ నెంబర్ సమస్యతో ఉద్యోగంలో చేరిన 3నెలల్లో 2నెలలు జీతాలు రాలేదని Way2Newsలో వార్త వచ్చింది. స్పందించిన అధికారులు 1100 మంది ఉపాధ్యాయులకు జీతాలు విడుదల చేశారు.
News January 13, 2026
ఖమ్మం: ఎల్‌ఐజీ ఫ్లాట్ల దరఖాస్తు గడువు 20 వరకు పొడిగింపు

ఖమ్మం శ్రీరాంనగర్‌లో హౌసింగ్ బోర్డు నిర్మించిన LIGఫ్లాట్ల దరఖాస్తు గడువును జనవరి 20వరకు పొడిగించినట్లు చీఫ్ ఇంజనీర్ జివి రమణారెడ్డి తెలిపారు. అప్రోచ్ రోడ్డు సమస్య పరిష్కారం కావడంతో మరోసారి దరఖాస్తులకు అవకాశం కల్పించామని చెప్పారు. అల్పాదాయవర్గాల కోసం కేటాయించిన ఈఫ్లాట్లకు ఆసక్తి గల వారు మీ-సేవ కేంద్రాల్లో దరఖాస్తుచేసుకోవాలని సూచించారు. జనవరి 23న లాటరీ ద్వారా ఫ్లాట్ల కేటాయింపు ఉంటుందని వెల్లడించారు.


