News August 22, 2025

పేద విద్యార్థికి అండగా నిలిచిన యాదాద్రి కలెక్టర్

image

పదో తరగతిలో వెనుకబడిన విద్యార్థులను ప్రోత్సహించాలనే సంకల్పంతో యాదాద్రి జిల్లా కలెక్టర్ హనుమంతరావు నారాయణపురం మండలం శేరిగూడెం గ్రామానికి చెందిన భరత్ చంద్ర అనే విద్యార్థిని గత సంవత్సరం దత్తత
తీసుకున్నారు. ఈ సందర్భంగా భరత్ కుటుంబ పరిస్థితి చూసి చలించిన కలెక్టర్ ఆర్థికంగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఈ మేరకు గురువారం రూ.5 వేలు ఆర్థిక సాయంతోపాటు మూడు నెలలకు సరిపడా నిత్యావసర సరకులను ఈరోజు అందజేశారు.

Similar News

News January 17, 2026

KMR: ఆదర్శ పాఠశాలల్లో ప్రవేశానికి దరఖాస్తుల ఆహ్వానం

image

కామారెడ్డి జిల్లాలోని ఆదర్శ పాఠశాలల్లో చేరడానికి విద్యార్థులు ప్రవేశ పరీక్ష కోసం దరఖాస్తులు చేసుకోవాలని జిల్లా విద్యాశాఖాధికారి రాజు తెలిపారు. ఈ నెల 28 నుంచి ఫిబ్రవరి 28వరకు ఆన్లైన్ లో దరఖాస్తులు స్వీకరించనున్నట్లు ఆయన తెలిపారు. 6 నుంచి 10వ తరగతి వరకు విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ఏప్రిల్ 19న ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నట్లు వెల్లడించారు. www.telanganams.cgg.gov.in ను సందర్శించాలన్నారు.

News January 17, 2026

C-DAC 60 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

image

బెంగళూరులోని <>C-DAC<<>> 60 ప్రాజెక్ట్ ఇంజినీర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత గల వారు నేటి నుంచి జనవరి 31 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి సంబంధిత విభాగంలో BE/BTech, ME/MTech, PG, PhD ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. రాతపరీక్ష/స్కిల్ టెస్ట్/ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://cdac.in

News January 17, 2026

రూ.13 వేల కోట్ల ప్లాంట్.. నేడే శంకుస్థాపన!

image

కాకినాడ రూరల్‌లో రూ.13 వేల కోట్లతో నిర్మించనున్న గ్రీన్ అమోనియా ప్లాంట్‌కు శనివారం సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ శంకుస్థాపన చేయనున్నారు. ఈ మేరకు శుక్రవారం ఎంపీ సానా సతీశ్, ఎమ్మెల్యే కొండబాబు, ఇన్‌ఛార్జ్ కలెక్టర్ అపూర్వ భరత్ ఏర్పాట్లను సమీక్షించారు. సీఎం కార్యక్రమాల సమన్వయకర్త పెందుర్తి వెంకటేశ్ ప్లాంట్ వద్ద పనులను పరిశీలించి అధికారులకు సూచనలు చేశారు.