News March 5, 2025

పేరుకే గ్రాడ్యుయేట్లు.. ఓటేయడంలోనూ ‘చెల్ల’లేదు..!

image

రెండు తెలుగు రాష్ట్రాల్లో జరిగిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో భారీగా చెల్లని ఓట్లు నమోదయ్యాయి. ఏపీలో 27 వేలు, టీజీలో 28 వేల ఓట్లు చెల్లుబాటు కాలేదు. బ్యాలెట్ పేపర్‌లో అభ్యర్థుల పేర్ల ఎదురుగా ఉన్న బాక్సుల్లో ప్రాధాన్య క్రమంలో అంకెలుగా ఓటు వేయాలని పదే పదే చెప్పినా ఓటర్లు పొరబాట్లు చేశారు. నిబంధనలు పాటించకపోతే ఓటు మురిగిపోతుందని ప్రచారం చేసినా పట్టభద్రులు అదే తప్పు చేశారు. దీనిపై మీ కామెంట్.

Similar News

News December 6, 2025

భారీ జీతంతో ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్‌లో ఉద్యోగాలు

image

<>ఢిల్లీ<<>> మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ 7 మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హతగల అభ్యర్థులు DEC 26వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి బీఈ/ బీటెక్(ఎలక్ట్రానిక్స్& కమ్యూనికేషన్, CS, IT, ఎలక్ట్రికల్), MCA ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. అసిస్టెంట్ మేనేజర్‌కు నెలకు రూ.81,000, మేనేజర్‌కు రూ.97,320 చెల్లిస్తారు. వెబ్‌సైట్: https://backend.delhimetrorail.com

News December 6, 2025

గుడికెళ్లి, దేవుడిని దర్శిస్తే పుణ్యం లభిస్తుందా?

image

ఆలయాలకు వెళ్లడం అంటే కేవలం దేవుడిని చూడటం కాదు. విగ్రహారాధనలోని రహస్యాన్ని, దర్శనం పరమార్థాన్ని తెలుసుకోవాలి. భగవంతుని గొప్ప లీలలు, గుణాలను మనసులో తలుచుకోవాలి. ఆయనే మనకు శరణం అని గుర్తించాలి. నిరంతరం ఆయనపై ధ్యానం ఉంచుతూ, ఆయనకు నచ్చిన మంచి పనులు చేయాలి. కేవలం దర్శనం కాకుండా, ఈ సత్యాన్ని గ్రహిస్తేనే మనం జీవితంలో మోక్షాన్ని సాధించగలం. <<-se>>#Bakthi<<>>

News December 6, 2025

టైప్ 5 డయాబెటిస్ సింప్టమ్స్ ఏంటో తెలుసా?

image

* న్యూట్రిషన్ డెఫిషియన్సీతో చర్మం, జుట్టు రంగుమారడం.
* లాలాజల గ్రంథుల్లో మార్పులు.
* రోగనిరోధక శక్తి తగ్గడంతో తరచూ చర్మం, చిగుళ్లు, యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ల బారిన పడడం.
* BMI (18.5) కంటే తక్కువ ఉండడం.
* దీర్ఘకాల పోషకాహార లోపం వల్ల ఎదుగుదల ఆగిపోవడం వంటివి టైప్-5 డయాబెటిస్ లక్షణాలు.
* అధిక దాహం, ఒకేసారి బరువు తగ్గడం, నీరసం, కంటిచూపు తగ్గడం డయాబెటిస్ ముఖ్య లక్షణాలు.