News May 7, 2025
పేరుపాలెం బీచ్‌లో ద్వారకాతిరుమల యువకుడు గల్లంతు

ద్వారకాతిరుమలకు చెందిన లాలూ నాయక్(17) నిన్న పేరుపాలెం బీచ్‌లో గల్లంతయ్యాడు. కొమ్మర, కోడిగూడెం, ద్వారకాతిరుమల, సత్తెన్నగూడెంకు చెందిన 9 మంది స్నేహితులతో కలిసి ఉదయం పేరుపాలెం బీచ్‌కు బయలుదేరి వెళ్లాడు. మధ్యాహ్నం సమయంలో స్నేహితుల తో కలిసి సరదాగా స్నానం చేస్తున్నాడు. లాలూ నాయక్, మధు అనే యువకులు కలసి బీచ్ లోపలికి వెళ్లారు. అకస్మాత్తుగా లాలూ నాయక్ గల్లంతయ్యాడు. మధు తప్పించుకుని ఒడ్డుకు చేరాడు.
Similar News
News February 11, 2026
చెత్త సేకరణలో కీలక మార్పు.. ఇకపై 4 డబ్బాల్లో!

కేంద్రం ‘సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ 2026’ పేరుతో సరికొత్త చెత్త సేకరణ విధానాన్ని తెచ్చింది. ఇకపై ఇంటి వద్దే వ్యర్థాలను నాలుగు రకాలుగా వేరు చేయడం తప్పనిసరి. గతంలో మూడు ఉండగా ఇప్పుడు ఒక డబ్బా పెరిగింది. తడి వ్యర్థాలకు గ్రీన్, పొడి వ్యర్థాలకు బ్లూ, ప్యాడ్లు-డైపర్ల కోసం రెడ్, ఇంట్లోని మెడికల్ వ్యర్థాల కోసం నలుపు డబ్బాలను వాడాలి. పర్యావరణ పరిరక్షణ, రీసైక్లింగ్ సులభతరం చేయడానికి ఈ మార్పు చేశారు.
News February 11, 2026
అమరావతి ఏపీకి శాశ్వత రాజధాని: గవర్నర్

AP: అమరావతి రాష్ట్రానికి శాశ్వత రాజధానిగా ఉంటుందని గవర్నర్ అబ్దుల్ నజీర్ అన్నారు. ‘క్వాంటం టెక్నాలజీ ద్వారా అమరావతిని గ్లోబల్ హబ్‌గా మార్చేందుకు సంకల్పించాం. అమరావతి భవిష్యత్తును నాశనం చేసే ఉద్దేశంతో గత ప్రభుత్వం 3 రాజధానుల ప్రతిపాదన తెచ్చింది. శ్వేతపత్రాల ద్వారా మా ప్రభుత్వం వాటిని ఎండగట్టింది. రాష్ట్ర GSDP రూ.15.91లక్షల కోట్ల నుంచి రూ.17.60లక్షల కోట్లకు పెరిగింది’ అని పేర్కొన్నారు.
News February 11, 2026
బౌరపూర్ జాతరకు మంత్రి సీతక్క రాక

నాగర్‌కర్నూల్ జిల్లా లింగాల మండలంలోని బౌరాపూర్ గ్రామంలో శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి జాతరకు ఫిబ్రవరి 14 తేదీన రాష్ట్ర మంత్రి సీతక్క, ఎమ్మెల్యే వంశీకృష్ణ రానున్నట్లు అధికారులు తెలిపారు. మూడు రోజుల పాటు జరిగే జాతర పూర్తిగా గిరిజన సంస్కృతి, సంప్రదాయాల ప్రకారం ఉంటుందన్నారు. భక్తులు అడవిలోకి ప్లాస్టిక్ వస్తువులు, అధిక శబ్దాలు చేస్తూ అడవి జంతువులకు ఇబ్బంది కల్గించవద్దని సూచించారు.


