News December 27, 2024

పేర్ని జయసుధ బెయిల్ పిటీషన్‌పై ముగిసిన వాదనలు

image

రేషన్ బియ్యం మాయం కేసులో మాజీ మంత్రి పేర్ని నాని సతీమణి జయసుధ ముందస్తు బెయిల్ పిటిషన్‌పై వాదనలు ముగిశాయి. బెయిల్ పిటిషన్‌పై ఈ నెల 30న ఆర్డర్ పాస్ చేయనున్నట్లు న్యాయమూర్తి తెలిపారు. బెయిల్ పిటిషన్‌పై ఉదయం నుంచి వాడివేడిగా వాదనలు సాగాయి. జయసుధ తరపున సీనియర్ న్యాయవాది వరదరాజులు, ప్రాసిక్యూషన్ తరఫున జిల్లా కోర్టు పీపీ లంకే వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.

Similar News

News January 24, 2025

పెనమలూరు: హత్య కేసులో నిందితుడు అరెస్ట్

image

హత్య కేసులో నిందితుడిని అరెస్ట్ చేసినట్లు పెనమలూరు పోలీసులు తెలిపారు. సీఐ వెంకట్ రమణ తెలిపిన సమాచారం మేరకు ఈ నెల 9వ తారీఖున పోరంకి ప్రభు నగర్‌కు చెందిన ఉమ్మడి రాణి అనే మహిళను తన అల్లుడైన నారబోయిన నరేశ్ హత్య చేశాడు. ఆప్పటినుంచి పరారీలో ఉన్న నరేశ్‌ను గురువారం రాత్రి అరెస్ట్ చేసినట్లు తెలిపారు. నిందితుడిని న్యాయమూర్తిగా హాజరు పరచగా రిమాండ్ విధించినట్లు శుక్రవారం తెలిపారు.

News January 24, 2025

కోడూరు: అంగన్వాడీ సెంటర్‌లో కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు 

image

కలెక్టర్ డీకే. బాలాజీ కోడూరు మండల పర్యటనలో భాగంగా శుక్రవారం ఉల్లిపాలెం అంగన్వాడీ సెంటర్‌లో ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. పిల్లల అటెండెన్స్, వంటశాల, మంచి నీటి వసతి, గ్రోత్ రిజిస్టర్‌ను తనిఖీ చేశారు. అనంతరం కలెక్టర్ స్వయంగా పిల్లల వెయిట్‌ను పరిశీలించారు. రిజిస్టర్‌లో చూపించిన రేగులర్ పేర్ల పిల్లలు లేకుండా అంగన్వాడీలో వేరే పిల్లలు ఉండటంతో కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.  

News January 24, 2025

మచిలీపట్నం: పలు డివిజన్లలో కలెక్టర్ ఆకస్మిక పర్యటన

image

మచిలీపట్నం నగర పాలక సంస్థ పరిధిలోని పలు డివిజన్లలో కలెక్టర్ డీకే బాలాజీ శుక్రవారం ఆకస్మికంగా పర్యటించారు. 45,46 డివిజన్లలో పర్యటించిన ఆయన ఆయా వార్డుల్లో చెత్త సేకరణను పరిశీలించారు. 46వ డివిజన్‌లో పారిశుద్ధ్యం సరిగ్గా లేకపోవటంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. కలెక్టర్ వెంట కమిషనర్ బాపిరాజు, తదితరులు ఉన్నారు.