News April 1, 2024
పొంగులేటికి ఖమ్మం, తుమ్మలకు మహబూబాబాద్

పార్లమెంట్ ఎన్నికల్లో మెజారిటీ సీట్లు కైవసం చేసుకోవాలనుకుంటున్న అధికార కాంగ్రెస్ దూకుడు పెంచింది. లోకసభ స్థానాల వారీగా ఇన్‌ఛార్జీలను నియమించింది. ఖమ్మం పార్లమెంట్ ఇన్‌ఛార్జీగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మహబూబాబాద్ పార్లమెంట్ ఇన్‌ఛార్జీగా తుమ్మల నాగేశ్వరరావు వ్యవహరించనున్నారని ఏఐసీసీ కార్యాలయం నుంచి ఆదివారం రాత్రి ప్రకటన విడుదల చేశారు.
Similar News
News February 12, 2026
ఖమ్మం: కౌంటింగ్ కేంద్రాల వద్ద BNS 163 అమలు

ఖమ్మం కమిషనరేట్ పరిధిలోని 5 మున్సిపల్ ఓట్ల లెక్కింపు సందర్భంగా శుక్రవారం మున్సిపల్ కౌంటింగ్ కేంద్రాల వద్ద ఆంక్షలు విధించినట్లు సీపీ సునీల్ దత్ తెలిపారు. BNS సెక్షన్ 163 అమల్లో ఉంటుందని, ర్యాలీలు, సభలు, ఐదుగురికిపైగా గుమికూడటం నిషేధమన్నారు. విజయోత్సవాలు, డీజేలు, టపాసులపై నిషేధం విధించారు. అదేరోజు ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ ముగిసే వరకు మద్యం అమ్మకాలు నిలిపివేయాలని సూచించారు.
News February 12, 2026
ఓటుతో సామాజిక మార్పు.. ట్రాన్స్‌జెండర్ల పౌర చైతన్యం

ఖమ్మం జిల్లాలోని 5మున్సిపాలిటీల్లో బుధవారం జరిగిన ఎన్నికల్లో ట్రాన్స్‌జెండర్లు ఉత్సాహంగా పాల్గొని పౌర బాధ్యత చాటారు. జిల్లాలో మొత్తం 24 మంది ట్రాన్స్‌జెండర్ ఓటర్లు ఉండగా, వారిలో 17 మంది (దాదాపు 71%) తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. సత్తుపల్లిలో 11 మంది, మధిరలో ముగ్గురు, ఎదులాపురంలో ఇద్దరు, వైరాలో ఒకరు చొప్పున ఓటు వేశారు. సామాజిక గుర్తింపు, మార్పు కోసమే తాము ఓటు వేసినట్లు వారు పేర్కొన్నారు.
News February 12, 2026
రేపు యథావిధిగా రవాణా శాఖ సేవలు: డీటీఓ

ఖమ్మం జిల్లాలోని రవాణా శాఖ కార్యాలయాల్లో రేపు అన్ని రకాల సేవలు యధావిధిగా అందుబాటులో ఉంటాయని డీటీఓ ధర్మపురి జగదీష్ తెలిపారు. జిల్లా కేంద్రంలోని ప్రధాన కార్యాలయంతో పాటు సత్తుపల్లి, వైరాలోని ఆర్టీఏ కార్యాలయాల్లోనూ కార్యకలాపాలు సాగుతాయని స్పష్టం చేశారు. దరఖాస్తుదారులు ముందస్తుగా స్లాట్లు బుక్ చేసుకోవచ్చని, వాహన రిజిస్ట్రేషన్లు, లైసెన్సుల జారీ తదితర సేవల కోసం కార్యాలయాలకు రావచ్చని పేర్కొన్నారు.


