News November 19, 2025

పొగమంచు తీవ్రత.. అనవసర ప్రయాణాలు వద్దు: ఎస్పీ

image

వాతావరణంలో పొగమంచు తీవ్రత పెరుగుతున్నందున, రాత్రి, తెల్లవారుజామున అవసరం ఉంటే తప్ప ప్రయాణాలు చేయవద్దని భూపాలపల్లి ఎస్పీ కిరణ్ ఖరే ప్రజలకు సూచించారు. ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదాల దృష్ట్యా, ఎదురుగా వచ్చే వాహనాలు కనబడక ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని తెలిపారు. ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకోవాలని కోరారు.

Similar News

News January 23, 2026

RCBని కొనుగోలు చేయనున్న అనుష్క?

image

RCB ఫ్రాంచైజీలో వాటా దక్కించుకోవడానికి విరాట్ కోహ్లీ భార్య, నటి అనుష్క శర్మ ప్రయత్నాలు చేస్తున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. అందుకోసం ఆమె బిడ్ వేయనున్నట్లు వార్తలొస్తున్నాయి. రూ.400 కోట్లు వెచ్చించి 3% వాటా కొనాలని చూస్తున్నట్లు సమాచారం. అయితే దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ప్రస్తుతం కోహ్లీ RCB తరఫున ఆడుతున్నారు. అటు ఈ ఫ్రాంచైజీ కోసం బిడ్ వేస్తానని అదర్ పూనావాలా <<18930355>>ఇప్పటికే<<>> ప్రకటించారు.

News January 23, 2026

మంచిర్యాల: ముగిసిన నూతన సర్పంచులు శిక్షణా తరగతులు

image

ఐదు రోజులుగా కొనసాగిన నూతన సర్పంచుల శిక్షణా తరగతులు ఈరోజు ముగిశాయి. జిల్లా స్థాయిలో నూతన సర్పంచులకు ముల్కల వద్ద స్థానిక కళాశాలలో ఈనెల 19వ తేదీ నుంచి ఈరోజు వరకు శిక్షణా తరగతుల కార్యక్రమాన్ని పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ శిక్షణ శిబిరంలో సర్పంచులకు గ్రామ పరిపాలన, గ్రామ అభివృద్ధి, ప్రజాపాలన, గురించి శిక్షణ ఇచ్చారు.

News January 23, 2026

రాష్ట్ర స్థాయి పోటీల్లో ఉమ్మడి ADB జిల్లాకు కాంస్య పతకం

image

నిజామాబాద్ జిల్లాలోని కమ్మరపల్లిలో గత మూడు రోజులుగా జరిగిన రాష్ట్ర స్థాయి స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ అండర్-17 సాఫ్ట్ బాల్ పోటీల్లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బాలుర జట్టు కాంస్య పతకం సాధించింది. ఈ పోటీల్లో ప్రతిభ కనబర్చిన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా జట్టు క్రీడాకారులతోపాటు కోచ్ కోట యాదగిరిని ఎస్జీఎఫ్ సెక్రటరీలు వెంకటేశ్, యాకుబ్, సాఫ్ట్‌బాల్ అసోసియేషన్ సభ్యులు, పలువురు అభినందించారు.