News November 19, 2025

పొగమంచు తీవ్రత.. అనవసర ప్రయాణాలు వద్దు: ఎస్పీ

image

వాతావరణంలో పొగమంచు తీవ్రత పెరుగుతున్నందున, రాత్రి, తెల్లవారుజామున అవసరం ఉంటే తప్ప ప్రయాణాలు చేయవద్దని భూపాలపల్లి ఎస్పీ కిరణ్ ఖరే ప్రజలకు సూచించారు. ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదాల దృష్ట్యా, ఎదురుగా వచ్చే వాహనాలు కనబడక ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని తెలిపారు. ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకోవాలని కోరారు.

Similar News

News January 24, 2026

జనవరి 24: చరిత్రలో ఈరోజు

image

1757: బొబ్బిలి యుద్ధం ప్రారంభం
1950: జనగణమన గీతాన్ని జాతీయ గీతంగా స్వీకరించిన భారత ప్రభుత్వం
1966: భారత ప్రధానిగా ఇందిరా గాంధీ(ఫొటోలో) బాధ్యతలు స్వీకరణ
1966: అణు శాస్త్రవేత్త హోమీ జహంగీర్‌ బాబా మరణం
1981: సినిమా నటి కాంచనమాల మరణం
* జాతీయ బాలికా దినోత్సవం

News January 24, 2026

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

News January 24, 2026

కాల్పుల కేసులో బాలీవుడ్ నటుడు అరెస్ట్!

image

ముంబైలోని ఓ రెసిడెన్షియల్ బిల్డింగ్‌పై కాల్పులు జరిగిన ఘటనలో బాలీవుడ్ నటుడు కమాల్ ఆర్ ఖాన్(KRK)ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఫైరింగ్ చేసిన తుపాకీని సీజ్ చేశారు. తన లైసెన్స్‌డ్ గన్ నుంచి తానే కాల్పులు జరిపినట్లు ఆయన ఒప్పుకున్నారు. గన్‌ని క్లీన్ చేశాక టెస్ట్ చేసేందుకు 4 రౌండ్స్ ఫైర్ చేసినట్లు తెలిపారు. జనవరి 18న ఘటన జరగ్గా పోలీసులు దర్యాప్తు చేసి ఫైరింగ్ జరిపింది KRKగా గుర్తించారు.