News April 10, 2024

పొన్నం అశోక్‌కు టీపీసీసీ లీగల్ పదవి

image

కరీంనగర్ జిల్లా కేంద్రానికి చెందిన సీనియర్ న్యాయవాది, పొన్నం అశోక్ గౌడ్ తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ లీగల్, హ్యూమన్ రైట్స్, ఆర్టీఐ డిపార్ట్మెంట్ ఛైర్మన్‌గా నియామకమయ్యారు. ఈ మేరకు ఏఐసీసీ వర్గాలు బుధవారం నియామక ఉత్తర్వులు జారీ చేశాయి. అశోక్ గౌడ్ నియామకం పట్ల స్థానిక న్యాయవాదులు, కాంగ్రెస్ నాయకులు, బార్ అసోసియేషన్ వర్గాలు అభినందనలు తెలిపాయి.

Similar News

News April 16, 2026

నిప్పుల కొలిమిలా కరీంనగర్ జిల్లా!

image

KNR జిల్లాలో భానుడు భగభగలాడుతున్నాడు. గురువారం జిల్లావ్యాప్తంగా ఎండలు ముదిరి, గరిష్ఠ ఉష్ణోగ్రతలు 44 డిగ్రీలు దాటాయి. మానకొండూరు మండలం ఈదుల గట్టపల్లిలో అత్యధికంగా 44.1°C ఉష్ణోగ్రత నమోదైంది. జమ్మికుంట, తిమ్మాపూర్ మండలాల్లోనూ 43 డిగ్రీలకు పైగా ఎండలు దంచికొట్టాయి. ఏప్రిల్ మధ్యలోనే వడగాల్పులు మొదలవ్వడంతో జనం అల్లాడిపోతున్నారు. వాతావరణ శాఖ ‘ఆరెంజ్ అలర్ట్’ జారీ చేస్తూ ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.

News April 16, 2026

కరీంనగర్ : అడిషనల్ కలెక్టర్ లక్ష్మీ కిరణ్‌కు ఘన వీడ్కోలు

image

కరీంనగర్ జిల్లా అడిషనల్ కలెక్టర్ (రెవెన్యూ) లక్ష్మీ కిరణ్ బదిలీపై సిద్దిపేటకు వెళుతున్న సందర్భంగా కలెక్టరేట్ ఆడిటోరియంలో ఘనంగా వీడ్కోలు నిర్వహించారు. కలెక్టర్ చిత్రా మిశ్రా మాట్లాడుతూ.. లక్ష్మీ కిరణ్ ప్రజలతో సాన్నిహిత్యం పెంచుకుని రెవెన్యూ సమస్యల పరిష్కారంలో విశేష సేవలు అందించారని కొనియాడారు. వరి కొనుగోలు నిర్వహణలో జిల్లాను ఆదర్శంగా నిలిపారని తెలిపారు. అధికారులు, సిబ్బంది ఆమెను సన్మానించారు.

News April 15, 2026

KNR: ఏసీబీకి చిక్కిన మున్సిపల్‌ ఏఈ

image

హుజూరాబాద్ మున్సిపల్ ఏఈ సుధాకర్ రెడ్డి లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండ్‌గా పట్టుబడ్డారు. బిల్లుల క్లియరెన్స్ కోసం ఏఈ ఓ కాంట్రాక్టర్ నుంచి రూ.50 వేలు లంచం డిమాండ్ చేశాడని బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. దీంతో ఏసీబీ అధికారులు పథకం ప్రకారం దాడులు చేసి సుధాకర్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై విచారణ కొనసాగతుంది.