News March 31, 2024
పొల్లూరు జలపాతంలో పడి వ్యక్తి మృతి

అల్లూరి జిల్లా చింతూరు డివిజన్ మోతుగూడెం పొల్లూరు జలపాతంలో ఓ పర్యాటకుడు మృతి చెందాడు. వివరాల్లోకి వెళితే.. ఆదివారం సెలవు కావడంతో తూగో జిల్లా రంగంపేట మండలం సింగంపల్లికి చెందిన కొందరు మోతుగూడెం వద్ద పొల్లూరు జలపాతానికి వచ్చారు. వారిలో కొండయ్య(33) అనే పర్యాటకుడు ప్రమాదవశాత్తు కాలుజారి జలపాతంలో పడ్డాడు. స్నేహితులు హుటాహుటీన మోతుగూడెం ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు.
Similar News
News February 14, 2026
విశాఖ చేరుకున్న సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్ సంజయ్ కరోల్

విశాఖలో రెండు రోజుల పర్యటన నిమిత్తం సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్ సంజయ్ కరోల్ శుక్రవారం విశాఖ చేరుకున్నారు. ఆయనకు కలెక్టర్ హరేంధిర ప్రసాద్ పుష్పగుచ్ఛం అందజేసి స్వాగతం పలికారు. కలెక్టర్‌తో పాటు పలువురు కోర్ట్ అధికారులు ఉన్నారు.
News February 14, 2026
విశాఖ: కలెక్టరేట్‌లో పీజీఆర్ఎస్ రద్దు

విశాఖలో 17 నుంచి 25 వరకు అంతర్జాతీయ ఫ్లీట్ రివ్యూ నిర్వహించనున్న నేపథ్యంలో కలెక్టరేట్లో ఫిబ్రవరి 16న నిర్వహించాల్సిన పీజీఆర్ఎస్ రద్దు చేసినట్టు కలెక్టర్ హరేంధిర ప్రసాద్ శుక్రవారం తెలిపారు. ఈ ఐఎఫ్ఆర్‌కు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ముఖ్య నేతలు రానున్న నేపథ్యంలో జిల్లా అధికారులు ఏర్పాట్ల నిర్వహణలో పాల్గొంటున్నారన్నారు. ఈ మేరకు నగర ప్రజలు గమనించాలని సూచించారు.
News February 13, 2026
ఇంటర్, పదో తరగతి పరీక్షల నిర్వహణకు పటిష్ట ఏర్పాట్లు: కలెక్టర్

విశాఖలో జరగనున్న ఇంటర్, 10వ తరగతి పబ్లిక్ పరీక్షలను లోపాలు లేకుండా పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ హరేంధిర ప్రసాద్ అధికారులను ఆదేశించారు. మార్చి 16 నుంచి పదో తరగతి, ఫిబ్రవరి 23 నుంచి ప్రారంభం కానున్న ఇంటర్ పరీక్షల నిర్వహణకు పటిష్ట ఏర్పాట్లు చేయాలని సూచించారు. పరీక్ష కేంద్రాల్లో మొబైల్ ఫోన్లు, స్మార్ట్ వాచీలు పూర్తిగా నిషేధించాలన్నారు.


