News November 19, 2025
పోక్సో కేసులో నలుగురికి ఐదేళ్ల జైలు శిక్ష: ASF SP

మైనర్ బాలికతో అసభ్య ప్రవర్తన, అత్యాచారయత్నం కేసులో కోర్టు నలుగురికి ఐదేళ్ల జైలు శిక్ష, ఒక్కొక్కరికి రూ.12,000 జరిమానా విధించినట్లు ఎస్పీ కాంతిలాల్ పాటిల్ తెలిపారు. 2020లో బెజ్జూర్‌లో జరిగిన ఈ ఘటనపై నమోదు చేసిన కేసును ప్రత్యేక కోర్టు పరిశీలించి నిందితులకు శిక్ష విధించిందన్నారు.
Similar News
News January 22, 2026
పాలమూరు జిల్లాలో ఐదుగురు కమిషనర్ల బదిలీ

త్వరలో మున్సిపల్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఐదుగురు మునిసిపల్ కమిషనర్లను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పాలమూరు కమిషనర్ ప్రవీణ్ కుమార్ రెడ్డి బదిలీ కాగా, నూతన కమిషనర్‌గా రామానుజులారెడ్డి, భూత్పూర్ చంద్రశేఖర్ రావు, అమరచింత నూరుల్ నజీబ్, అచ్చంపేట సిహెచ్ వేణు, కొల్లాపూర్ యాదగిరిలను నూతన కమిషనర్లుగా ఇవాళ బాధ్యతలు స్వీకరించనున్నారు.
News January 22, 2026
పెద్దపల్లి: దివ్యాంగుల ఉపకరణాలకు దరఖాస్తుల ఆహ్వానం

అర్హులైన దివ్యాంగులు ఉచిత సహాయక ఉపకరణాల కోసం ఈనెల 31లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని జిల్లా సంక్షేమ అధికారి వేణుగోపాల్ రావు కోరారు. రాష్ట్ర ప్రభుత్వం 100 శాతం సబ్సిడీతో బ్యాటరీ వీల్‌చైర్లు, ల్యాప్‌టాప్‌లు, ట్యాబ్‌లు, ట్రై సైకిళ్లు పంపిణీ చేయనుందని తెలిపారు. తెలంగాణ వికలాంగుల సహకార సంస్థ ద్వారా ఈ పథకం అమలవుతుందని పేర్కొన్నారు. ఆసక్తి గలవారు గడువులోగా తమ వివరాలను నమోదు చేసుకోవాలని సూచించారు.
News January 22, 2026
రుయాలో AI సేవలు ప్రారంభం

రోగులకు రియల్ టైమ్‌లో వేగంగా, అత్యాధునిక వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం రుయాలో AI ఆధారిత ‘నెక్స్ట్ జెన్’ సాఫ్ట్‌వేర్‌ను ఏర్పాటు చేసింది. ఓపీ, ఐపీ, సర్జరీ, ల్యాబ్, రేడియాలజీ, ఐసీయూ, ఫార్మసీ విభాగాలతో ఈ సాంకేతికత అనుసంధానమై పనిచేస్తుంది. ఇకపై ప్రతి రోగికి ప్రత్యేక ఐడీ క్రియేట్ చేసి, ఆయుష్మాన్ భారత్ హెల్త్ అకౌంట్‌తో అనుసంధానం చేయడం ద్వారా జీవితకాల ఆరోగ్య వివరాలు డిజిటల్‌గా భద్రపరచనున్నారు.


