News December 10, 2024
పోక్సో కేసులో నిందితుడి అరెస్టు: కదిరి సీఐ
కదిరి మైనర్ బాలికకు మాయ మాటలు చెప్పి ప్రేమ పేరుతో మోసం చేసిన కేసులో నిందితుడు నాగరాజును అరెస్టు చేసినట్లు సీఐ నారాయణరెడ్డి తెలిపారు. సీఐ వివరాల మేరకు.. నాగరాజు ఆటో నడుపుకుంటూ జీవనం గడుపుతున్నాడు. 10వ తరగతి చదువుతున్న మైనర్ బాలికను మభ్యపెట్టి మోసం చేశాడని బాలిక కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోక్సో కేసు నమోదు చేసి అరెస్ట్ చేసినట్లు చెప్పారు. రిమాండ్‌కు పంపినట్లు వివరించారు.
Similar News
News January 20, 2025
మైనస్ 8 డిగ్రీల చలిలో తాడిపత్రి చిన్నారుల నృత్యం
తాడిపత్రికి చెందిన చిన్నారులు జమ్మూ కశ్మీర్‌లోని వైష్ణోదేవి టెంపుల్, హిడింబ వద్ద మైనస్ 8 డిగ్రీల చలిలో కూచిపూడి నృత్యం చేసి అందరిని అబ్బురపరిచారు. దాదాపు 22 కిలోమీటర్లు కాలినడకన చేరుకుని నృత్య ప్రదర్శన చేసినట్లు శిక్షకులు వందన, ప్రవీణ్ లు తెలిపారు. ఈ చిన్నారులు ఇప్పటికే వరల్డ్ రికార్డ్ బుక్‌లో చోటు సంపాదించారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేత అభినందనలు అందుకున్నారు.
News January 20, 2025
ప్రేమ పేరుతో వేధింపులు.. యువకుడిపై పోక్సో కేసు
అనంతపురం జిల్లా ఉరవకొండలో ఓ యువకుడిపై పోక్సో కేసు నమోదైంది. సీఐ మహానంది వివరాల మేరకు.. పట్టణానికి చెందిన చిరంజీవి అనే యువకుడు ప్రేమ పేరుతో ఓ బాలికను వేధిస్తున్నాడు. హెచ్చరించినా అతడి తీరు మారలేదు. తరచూ వేధింపులకు గురిచేస్తుండటంతో బాలిక తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. వారి ఫిర్యాదు మేరకు యువకుడిపై పోక్సో కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు.
News January 20, 2025
వయోపరిమితిపై సందేహాలు ఉంటే నివృత్తి చేసుకోవచ్చు: ఎస్పీ
పోలీస్ దేహదారుఢ్య పరీక్ష అభ్యర్థులకు వయోపరిమితిపై జీవో 155 ద్వారా నివృత్తి చేసుకోవచ్చని అనంతపురం ఎస్పీ జగదీశ్ కోరారు. వయో పరిమితి ఉన్నా అనుమతించడం లేదంటూ మీడియాలో ప్రచురితమైన వార్తలో నిజం లేదన్నారు. 2022 నవంబర్ 28న ఏపీ పోలీస్ స్టేట్ లెవెల్ రిక్రూట్మెంట్ విడుదల చేసిన నోటిఫికేషన్ క్షుణ్ణంగా గమనించాలన్నారు.