News November 30, 2025
పోచంపల్లిలో అత్యల్ప ఉష్ణోగ్రత

ఉమ్మడి నల్గొండ జిల్లాలో శీతల గాలులు వీస్తున్నాయి. రెండు రోజులుగా ఉష్ణోగ్రతలు భారీగా పడిపోవడంతో ప్రజలు చలికి వణికిపోతున్నారు. శనివారం ఉదయం యాదాద్రి జిల్లా పోచంపల్లిలో అత్యల్పంగా 12.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. నల్గొండ చర్లపల్లిలో 12.6, సూర్యాపేట జిల్లా తుంగతుర్తిలో 13.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. గడ్డకట్టించే వాతావరణం ఉండటంతో నిత్యావసరాల కోసం తప్ప ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావడం లేదు.
Similar News
News February 16, 2026
JEE మెయిన్స్‌లో భాష్యం విద్యార్థి ప్రభంజనం

JEE మెయిన్-2026లో భాష్యం IIT జేఈఈ అకాడమీ విద్యార్థి యోగ శివ సాయి శ్రీరామ్ HT.NO(260310102840) ప్రభంజనం సృష్టించాడు. విద్యాసంస్థల ఛైర్మన్ రామకృష్ణ సోమవారం వివరాలు వెల్లడించారు. విద్యార్థి 99.99 టాప్ పర్సంటైల్‌తో ఆల్ ఇండియా ఓపెన్ క్యాటగిరిలో టాపర్‌గా నిలిచి ఉత్తమ ప్రతిభ కనపరిచాడని చెప్పారు. వైస్ ఛైర్మన్ భాష్యం హనుమంతురావు విద్యార్థికి, అధ్యాపకులకు అభినందనలు తెలిపారు.
News February 16, 2026
ఉపాధి బిల్లుల నమోదు పూర్తిచేయాలి: కలెక్టర్

ఉపాధి హామీ పథకం కింద మెటీరియల్ ఎక్స్పెండిచర్ బిల్లుల నమోదును నెలాఖరులోగా పూర్తి చేయాలని కలెక్టర్ ఆనంద్ ఆదేశించారు. కలెక్టరేట్‌లో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతూ.. నమోదు చేయాల్సిన రూ.131 కోట్లలో ఇప్పటివరకు రూ.77.46 కోట్లు మాత్రమే అప్లోడ్ అయ్యాయని తెలిపారు. మిగిలిన బిల్లులను వెంటనే నమోదు చేసి లక్ష్యాలు సాధించాలని హెచ్చరించారు. సంబంధిత అధికారులకు రోజువారీ ఫీడ్‌బ్యాక్ ఇవ్వాలని సూచించారు.
News February 16, 2026
నిరుద్యోగ యువతకు మత్స్యశాఖ గుడ్‌న్యూస్

జిల్లా నిరుద్యోగ యువతకు, చిరు వ్యాపారులకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు మత్స్యశాఖ ఆధ్వర్యంలో మోటార్ సైకిల్ విత్ ఐస్ బాక్స్ యూనిట్ల పంపిణీకి జిల్లా యంత్రాంగం నోటిఫికేషన్ జారీ చేసింది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను మొత్తం 19 యూనిట్లు మంజూరు చేయనున్నట్లు పేర్కొంది. ఇందులో జనరల్ కేటగిరీకి 13 యూనిట్లు, మహిళలకు 2, ఎస్సీ వర్గానికి 3, ఎస్టీ వర్గానికి 1 కేటాయించినట్లు అధికారులు తెలిపారు.


